Ghani: బ్యాలెన్స్ తప్పిన గని.. నిజాన్ని ఒప్పుకున్న హీరో వరుణ్!
సినిమా పోయినా సరే హిట్ అని డబ్బా కొట్టుకుంటున్న ఈరోజుల్లో.. మెగాప్రిన్స్ తన ఒరిజనల్ గట్స్ చూపించాడు. ప్రతిసారి సినిమా కోసం ఒకేలా కష్టపడతానని.. అయితే కొన్ని సక్సెస్ సాధిస్తే..

Ghani 3 Days Worldwide Collections
Ghani: సినిమా పోయినా సరే హిట్ అని డబ్బా కొట్టుకుంటున్న ఈరోజుల్లో.. మెగాప్రిన్స్ తన ఒరిజనల్ గట్స్ చూపించాడు. ప్రతిసారి సినిమా కోసం ఒకేలా కష్టపడతానని.. అయితే కొన్ని సక్సెస్ సాధిస్తే.. కొన్ని పాఠాలు నేర్పిస్తాయని ట్వీట్ చేశాడు. గట్టి పంచ్ ఇవ్వబోయి.. బ్యాలెన్స్ తప్పిన గని గురించి వరుణ్ తేజ్ ఉన్నది ఉన్నట్టు పోస్ట్ చేసి హేటర్స్ కి సూపర్ పంచ్ ఇచ్చాడు.
Ghani: గని రిజల్ట్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ నోట్!
ఈమధ్య సినిమా ఫ్లాప్ అని క్లియర్ గా తెలుస్తున్నా.. సక్సెస్ మీట్స్, థ్యాంక్స్ మీట్స్ చేసి ప్రమోషన్ హవా చూపిస్తున్నారు హీరోలు. కానీ వరుణ్ తేజ్ కాస్త డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. గని పూర్ రెస్పాన్స్ ను అర్ధం చేసుకుని వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఫ్యాన్స్, జనరల్ ఆడియెన్స్, క్రిటిక్స్ ను గని సంతృప్తి పరచలేదని తెలిసి పర్సనల్ లెటర్ తో ఓ ట్వీట్ చేశాడు. నిజానికి సినిమా పోతే ఆ నిజాన్ని ఒప్పుకోవాడనికి సో కాల్డ్ హీరోలు సాహసించరు. బట్ వరుణ్ తేజ్ దాన్ని ఎలా డీల్ చేయాలో చేసి చూపించాడు.
Ghani: వరుణ్ తేజ్ గని OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
గని కోసం వరుణ్ తేజ్ మూడేళ్లు కష్టపడ్డాడు. పూర్తిగా మేకోవర్ అయ్యాడు. కొవిడ్ పరిస్థితులను దాటుకుని ఎన్నో వాయిదాల తర్వాత ఏప్రిల్ 8న గని రిలీజ్ అయింది. బట్ ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న వరుణ్.. గని కోసం అందరూ రియల్ ప్యాషన్ తో పని చేశారని… కానీ అనుకున్నది డెలివరీ చేయలేకపోయామని చెప్పుకొచ్చాడు. ఫ్యాన్స్ ఎంటర్ టైన్ చేయడానికి.. ప్రతి సినిమాకు ఒకేలా కష్టపడతానని.. కానీ కొన్ని సక్సెస్ అందిస్తే.. కొన్ని పాఠాలు నేర్పిస్తాయని.. ఏదేమైనా హార్ట్ వర్క్ ను మాత్రం ఆపనన్నాడు మెగాప్రిన్స్.