‘ప్రతిరోజూ పండగే’ – గ్లింప్స్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ప్రతిరోజూ పండగే’ గ్లింప్స్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ప్రతిరోజూ పండగే’ గ్లింప్స్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ.. ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇంతకుముందు ‘భలేభలే మగాడివోయ్’ ఈ బ్యానర్ల కలయికలోనే రూపొందగా, మళ్లీ మారుతి చేస్నున్న రెండవ చిత్రం ఇది.
సుప్రీమ్ తర్వాత రాశీ ఖన్నా, సాయి ధరమ్ తేజ్‌తో జతకడుతుంది. సాయి ధరమ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ప్రతిరోజూ పండగే’ గ్లింప్స్ రిలీజ్ చేశారు. తేజు, సత్యరాజ్‌ల రిలేషన్, పల్లెటూరి వాతావరణం, ఫ్యామిలీ అనుబంధాలు వంటివి గ్లింప్స్‌లో చూపించారు.
Read Also : ‘దేత్తడి పోచమ్మగుడి’ – మాస్‌కు పూనకాలే..
విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ‘ప్రతిరోజూ పండగే’ త్వరలో విడుదల కానుంది. సంగీతం : థమన్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, కో-ప్రొడ్యూసర్ : ఎస్‌కెఎన్, నిర్మాత : బన్నీ వాసు.