Global Star Ram Charan In Unstoppable with NBK S4 as guest
నందమూరి బాలకృష్ణ హీరోగానే కాదు హోస్ట్‌గా సైతం రాణిస్తున్నారు. ఆయన వ్యాఖ్యాతగా చేస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకి అదరిపోయే రెస్పాప్స్ వస్తోంది. విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి కాగా ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. ఈ నాలుగో సీజన్‌లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇటీవల విక్టరీ వెంకటేష్ అతిథిగా వచ్చారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా వెంకీతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి సైతం బాలయ్య షోలో సందడి చేశారు.
తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో రాబోతున్నారు. ఆయనే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్. గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో భాగంగా బాలయ్య షోకి చరణ్ రానున్నట్లు తెలుస్తోంది. రేపు (డిసెంబర్ 31న) హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చరణ్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Allu Arjun : అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా..
గతంలో ఓ సీజన్‌లో ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ సందర్భంలో ఆయన రామ్‌చరణ్‌కి ఫోన్ చేయగా బాలయ్య మాట్లాడారు. నా షోకు ఎప్పుడు వస్తున్నావ్ అని బాలయ్య అడుగగా.. మీరు పిలవడమే లేటు అని చరణ్ అన్నాడు. ఇన్నాళ్లకు ఆ సమయం రానే వచ్చినట్లుగా తెలుస్తోంది.
శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్‌లు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. బాలయ్య నటించిన డాకు మహారాజ్ జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Pawan kalyan – Dil raju : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ..