Allu Arjun : అల్లు అర్జున్ రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ పై ముగిసిన వాద‌న‌లు.. తీర్పు వాయిదా..

సినీ న‌టుడు అల్లు అర్జున్ రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ వాయిదా ప‌డింది.

Allu Arjun : అల్లు అర్జున్ రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ పై ముగిసిన వాద‌న‌లు.. తీర్పు వాయిదా..

Allu Arjun Bail Petition hearing adjourned for january 3rd

Updated On : December 30, 2024 / 1:03 PM IST

సినీ న‌టుడు అల్లు అర్జున్ రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ వాయిదా ప‌డింది. జ‌న‌వ‌రి 3కు నాంప‌ల్లి కోర్టు వాయిదా వేసింది. అల్లు అర్జున్ వేసిన రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ పై చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. అనంత‌రం అల్లు అర్జున్ త‌రుపు లాయ‌ర్లు బెయిల్ మంజూరు చేయాలంటూ త‌మ వాద‌న‌లు వినిపించారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు ముగిసిన అనంత‌రం తీర్పును జ‌న‌వ‌రి 3కి వాయిదా వేసింది నాంప‌ల్లి కోర్టు.

సంధ్య థియేట‌ర్‌లో డిసెంబ‌ర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. అయితే..ఆ స‌మ‌యంలో సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌పై చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను డిసెంబ‌ర్ 13న అరెస్ట్ చేసి నాంప‌ల్లి కోర్టులో హాజ‌రుప‌రిచారు. న్యాయ‌స్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

Pawan kalyan – Dil raju : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ..

వెంట‌నే అల్లు అర్జున్ న్యాయ‌వాదులు హైకోర్టును ఆశ్ర‌యించారు. క్వాష్ పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి అల్లు అర్జున్ విడుద‌ల అయ్యారు. రిమాండ్ గ‌డువు ముగియ‌డంతో గ‌త శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 27) అల్లు అర్జున్ వ‌ర్చువ‌ల్‌గా కోర్టుకు హాజ‌రు అయ్యారు.

అదే స‌మ‌యంలో అల్లు అర్జున్ న్యాయ‌వాదులు రెగ్యుల‌ర్ బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు పోలీసులు స‌మ‌యం కోర‌డంతో నేటికి వాయిదా ప‌డింది. దీనిపై నేడు విచార‌ణ జ‌రుగ‌గా తీర్పును జ‌న‌వ‌రి 3కి వాయిదా వేసింది నాంప‌ల్లి కోర్టు.

Laila : విశ్వ‌క్ సేన్ ‘లైలా’ మూవీ నుంచి ‘సోను మోడ‌ల్’ సాంగ్ వ‌చ్చేసింది.. అదిరిపోయిన స్టెప్పులు..