Game Changer : దివాళీ రోజున రామ్ చరణ్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్..

దివాళీ రోజున రామ్ చరణ్ అభిమానులను ఖుషీ చేసే ఒక గుడ్ న్యూస్.

Good news for Ram Charan fans about Game Changer movie

Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘జరగండి’ సాంగ్ రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించి అభిమానుల్లో అసలు పుట్టించి.. మళ్ళీ పోస్టుపోన్ వార్త చెప్పి అందర్నీ తీవ్ర బాధకి గురి చేశారు. ఆల్రెడీ లీక్ అయిన పాటని అఫీషియల్ గా రిలీజ్ చేయడానికి ఆడియో డాక్యుమెంటేషన్ ఇష్యూస్ వచ్చాయని, ప్రస్తుతానికి వాయిదా వేసి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని తెలుపుతూ మేకర్స్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అభిమానులను నిరాశకు గురి చేశారు.

ఇది ఒక్కటే కాదు ఈ మూవీ షూటింగ్ విషయం కూడా అభిమానులను విసెగెత్తిస్తుంది. ఇన్నాళ్లు ఇండియన్ 2 షూటింగ్ వల్ల గేమ్ ఛేంజర్ లేట్ అవుతూ వచ్చింది. ఇటీవల ఇండియన్ 2 షూటింగ్ పూర్తి అయ్యింది అనుకుంటే.. ఇప్పుడు ఇండియన్ 3ని కూడా మొదలు పెట్టారు. ఈ షూటింగ్ కోసం మరో నలభై రోజులను శంకర్ కేటాయించాడు. దీంతో గేమ్ ఛేంజర్ కి మళ్ళీ బ్రేక్ వచ్చి పడింది. ఈ ఇండియన్ 3 షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో..? గేమ్ ఛేంజర్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో అని అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.

Also read : Shobha Shetty : శోభా శెట్టి లవర్ ఎవరో తెలుసా..? తెలిస్తే ఇతనా అని షాక్ అవుతారు..

అయితే పండగ పుట వారందరికీ ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఈ నెల 21 వరకు శంకర్ ఇండియన్ 2 షూటింగ్ లో ఉండనున్నాడట. 24వ తేదీ నుంచి గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయన్నురట. ఈ కొత్త షెడ్యూల్ దాదాపు 20 రోజులు పాటు జరగనుందని సమాచారం. అలాగే మూవీని వచ్చే ఏడాది దసరాకి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ వార్త చరణ్ అభిమానులను కొంచెం సంతోష పరుస్తుంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.