Gopichand : గోపిచంద్ బ‌ర్త్‌డే.. స్పెష‌ల్ గ్లింప్స్ వ‌చ్చేసింది..

టాలీవుడ్ హీరో గోపించంద్‌, ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి డైరెక్ష‌న్‌లో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు.

Gopichand : గోపిచంద్ బ‌ర్త్‌డే.. స్పెష‌ల్ గ్లింప్స్ వ‌చ్చేసింది..

Gopichand33 Birthday Glimpse

Updated On : June 12, 2025 / 10:53 AM IST

టాలీవుడ్ హీరో గోపించంద్‌, ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి డైరెక్ష‌న్‌లో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. #Gopichand33 వ‌ర్కింట్ టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇక నేడు గోపిచంద్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం స్పెష‌ల్ గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది. అత‌డో యోధుడు విప్ల‌వాన్ని ర‌గిలించ‌డానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ వీడియోను పంచుకుంది.

భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ పై చిట్టూరి శ్రీనివాస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

Kalpika : సినీ నటి కల్పికకు షాక్‌.. గ‌చ్చిబౌలి పీఎస్‌లో కేసు న‌మోదు..

ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి గ‌తంలో ఘాజీ, అంత‌రిక్షం వంటి సినిమాల‌ను తెర‌కెక్కించాడు. కొంత గ్యాప్ త‌రువాత ఆయ‌న నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.