Kalpika : సినీ నటి కల్పికకు షాక్.. గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదు..
సినీ నటి కల్పిక పై కేసు నమోదైంది.

సినీ నటి కల్పిక పై కేసు నమోదైంది. ప్రిజం పబ్ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కల్పికపై ఫిర్యాదు చేయడంతో కోర్టు అనుమతితో ఆమె పై కేసు నమోదు చేశారు.
సదరు నటి గత నెల 29న బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అభస్యంగా ప్రవర్తించడం, ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, అసభ్య పదజాలం వాడడం వంటివి చేసినట్లు ఫిర్యాదులో పబ్ నిర్వాహకులు పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే ఆమె హంగామా చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో 324(4),352,351(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కల్పిక పై పోలీసులు కేసు నమోదు చేశారు.
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కే. మహేంద్ర కన్నుమూత
ఇటీవల కల్పిక తన బర్త్ డే సందర్భంగా ప్రిజం పబ్‌లో వేడుకలు చేసుకుంది. అయితే.. బయటి నుంచి కేకును సిబ్బంది లోనికి అనుమతించకపోవడంతో కల్పిక, పబ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందులో పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించిన సంగతి తెలిసిందే.
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన ఆరెంజ్ మూవీలో జెనీలియా ఫ్రెండ్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కల్పిక. ఆ తరువాత జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలలో నటించింది.