Gopichand : గోపీచంద్ ‘రామబాణం’ శ్రీవాస్.. హ్యాట్రిక్ హిట్టు కొడతారా?
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ చివరిగా జులైలో 'పక్కా కమర్షియల్' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ హీరో తనకి ఎంతో కలిసొచ్చిన దర్శకుడితోనే మళ్ళీ జతకడుతున్నాడు.

Gopichand again collaborate with srivaas
Gopichand : టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ చివరిగా జులైలో ‘పక్కా కమర్షియల్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ హీరో తనకి ఎంతో కలిసొచ్చిన దర్శకుడితోనే మళ్ళీ జతకడుతున్నాడు. లక్ష్యం, లోక్యం వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ మరో సినిమాకి ఓకే చెప్పేశాడు.
Prabhas in Unstoppable Show : బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్, గోపీచంద్..
ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమాకి ‘రామబాణం’ అనే టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. లక్ష్యంతో ఫ్యామిలీ డ్రామాని, లౌక్యంలో కామెడీని పండించిన గోపీచంద్, శ్రీవాస్ లు.. ఈ సినిమాలో సామజిక అంశాన్ని టచ్ చేయబోతున్నారు అని తెలుస్తుంది. అలాగే గోపీచంద్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్, శ్రీవాస్ కామెడీ టైమింగ్ కూడా ఉండనుంది. మరి ఈసారి కూడా వీరిద్దరూ సక్సెస్ అయ్యి హ్యాట్రిక్ హిట్టుని అందుకుంటారా?
గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ గురించికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు మేకర్స్. కాగా గోపీచంద్ తన బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ తో కలిసి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ కొత్త ఎపిసోడ్ కి గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ వారం ఆ ఎపిసోడ్ ప్రసారం కానుంది.