Ramabanam : ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న గోపీచంద్ రామబాణం..
గోపీచంద్ నటించిన 'రామబాణం' థియేటర్స్ లో రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. తాజాగా..

Gopichand Dimple Hayathi Ramabanam OTT release date fix
Ramabanam : శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ (Gopichand) చేసిన మూడో సినిమా ‘రామబాణం’. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్ హిట్స్ అవ్వడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో డింపుల్ హయతి (Dimple Hayathi) హీరోయిన్ గా నటించగా జగపతి బాబు (Jagapathi Babu), ఖుష్బూ ముఖ్య పాత్రలు చేశారు. మే 5న థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ అంచనాలు అందుకోలేక ప్లాప్ గా నిలిచింది.
Mahesh – Pawan : అప్పుడు పవన్ కోసం మహేష్.. ఇప్పుడు మహేష్ కోసం పవన్.. నిజమేనా..?
ఇక రిలీజ్ అయ్యి 4 నెలలు గడుస్తున్నా ఈ మూవీ ఓటీటీకి రావడం లేదు. కారణం ఏంటో తెలియదు గాని ఇన్నాళ్లు ఓటీటీ రిలీజ్ ని ప్రకటించని ఈ మూవీ.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ లో సందడి చేయడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 14 నుంచి ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషలతో కలిపి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ప్రసారం కానుంది. మరి థియేటర్ లో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో చూసేయండి.
ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. కన్నడ స్టార్ డైరెక్టర్ హర్షతో తన 31వ సినిమాని చేస్తున్నాడు. కన్నడలో భజరంగి, భజరంగి 2, వజ్రకాయ, అంజనీ పుత్ర, వేదా.. లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన హర్ష.. ఇప్పుడు గోపీచంద్ తో ఒక ఉరమస్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ‘భీమా’ అనే టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో గోపీచంద్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. KGF సినిమాకు సంగీతం అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.