Gopichand: అఫీషియల్.. గోపీచంద్ రామబాణం వదిలేది ఆ రోజునే!
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘రామబాణం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ విజయం అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక ఈ సినిమాతో గోపీచంద్ తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Gopichand Rama Banam Movie Locks Release Date
Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘రామబాణం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ విజయం అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక ఈ సినిమాతో గోపీచంద్ తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Gopichand RamaBanam : గోపీచంద్ మొదటి బాణం అదిరిపోయింది.. రామబాణం ఫస్ట్ లుక్ టీజర్..
గతంలో గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో లక్ష్యం, లౌక్యం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు రావడంతో, ఈసారి వీరిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను రివీల్ చేశారు.ఈ సినిమాను వేసవి కానుకగా మే 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
GopiChand30 : బాలయ్య చెప్పిన టైటిల్‌నే ఖాయం చేసుకున్న గోపీచంద్..
విద్యార్ధుల పరీక్షలు ముగిశాక తమ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ క్రమంలో విద్యార్ధులు బాగా చదివి, పరీక్షలు బాగా రాయాలని చిత్ర యూనిట్ కోరింది. పరీక్షల తరువాత థియేటర్లలో కలుద్దాం అని చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్‌ను వెల్లడించింది. ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.