Gorre Puranam : కంటెంట్ బేస్డ్ చిత్రాల‌కి కేర్ ఆఫ్ అడ్రస్ ‘ఆహా’లో మరో కొత్త సినిమా.. సుహాస్ ‘గొర్రె పురాణం’ ఎప్ప‌టినుంచంటే?

ఓటీటీల్లో తెలుగు వారికి ఎంతో ద‌గ్గ‌రైంది ఆహా.

Gorre Puranam Streaming Soon In Aha Ott Details Here

Gorre Puranam : ఓటీటీల్లో తెలుగు వారికి ఎంతో ద‌గ్గ‌రైంది ఆహా. వైవిద్యమైన కథనాలతో, వినూత్నమైన సినిమాటిక్‌ విలువలను అందించ‌డంలో ఆహా ఎప్పుడూ ముందుంటుంది. కొత్త సినిమాలు, ప‌లు ర‌కాల షోలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఉంటుంది. చిన్ని సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్‌ ఉంటే చాలు ప్రోత్సాహం అందిస్తామంటున్నారు ఆహా యజమాన్యం. ఈ విధానానికి శ్రీకారం చుట్టింది, నాంది పలికింది ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామే. తాజాగా మ‌రో కొత్త సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తోంది.

ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో సుహాస్ హీరోగా ప్రవీణ్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘గొర్రె పురాణం’. సెప్టెంబర్ 20న ఈ మూవీ థియేటర్స్ లో విడుద‌లైంది. ఈ చిత్రానికి థియేట‌ర్ల‌లో మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఆహా ఓటీటీలోకి రానుంది గొర్రె పురాణం మూవీ. దసరా కానుకగా అక్టోబర్ 10 నుంచి ఆహాలో గొర్రె పురాణం మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Bigg Boss 8 : ఇమిటేట్ చేసిన అవినాష్‌.. ఇరిటేష‌న్ తెప్పించ‌కు అంటూ మండిప‌డ్డ గౌత‌మ్‌.. గ‌ట్టిగానే హ‌ర్ట్ అయిన‌ట్లు ఉన్నారుగా..

సుహాస్ హీరోగా తొలి సినిమా కలర్ ఫోటో డైరెక్ట్ ఆహా ఓటీటీలోనే రిలీజయి భారీ విజయం సాధించి నేషనల్ అవార్డు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండంతో సుహాస్ మాట్లాడుతూ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం సినిమాపై మేము ఇష్టంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామంటే ఆహా లాంటి వేదికలు మాకు సపోర్ట్ చేయడమే కారణం అని అన్నారు.

Janaka Aithe Ganaka Release Trailer : సుహాస్ ‘జనక అయితే గనక’ రిలీజ్ ట్రైలర్.. న‌వ్వులే న‌వ్వులు..