Allu Arjun : రాకాలో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న రాకా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
Gossip Garage Allu Arjun to play triple role in Raaka
Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న రాకా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై ఇప్పుడో ఓ ఆసక్తికరమైన గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో అల్లుఅర్జున్ ఒకటి కాదు.. ఏకంగా మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించబోతున్నారట. ఈ మూడు పాత్రల లుక్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటాయని టాక్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందట.
సాధారణంగా ఒక హీరో మూడు పాత్రల్లో కనిపిస్తే..వాళ్ల మధ్య అన్నదమ్ముల బంధమో, తండ్రీ కొడుకుల సంబంధమో, గత జన్మ కనెక్షన్లో ఉంటుందని ఊహిస్తాం. కానీ రాకాలో మాత్రం ఈ ముగ్గురు క్యారెక్టర్స్‌కు ఎలాంటి సంబంధం ఉండదట. ముగ్గురూ తమ తమ ప్రపంచాల్లో, తమ తమ కథల్లో కనిపిస్తారని..అయితే కథ ముందుకు వెళ్లే కొద్దీ ఈ మూడు కథలు ఒకే పాయింట్ దగ్గరికి వచ్చి కలుస్తాయని టాక్. మూడు పాత్రల జీవితాలు వేర్వేరు..వాళ్ల సమస్యలు వేర్వేరు..వాళ్ల నేపధ్యాలు కూడా వేర్వేరుగా ఉంటాయట. కానీ ఏదో ఒక కీలకమైన సంఘటన ఈ ముగ్గురినీ ఒకే కథలోకి తీసుకొస్తుందట.
Manasa Varanasi : పువ్వుతో తెలుగు అందం.. మానస వారణాసి క్యూట్ ఫోటోలు..
ముగ్గురికీ సంబంధం లేదు. కానీ ముగ్గురి కథ ఒక్కటే అనే కాన్సెప్ట్ సినిమాలో మెయిన్ హైలైట్‌గా ఉండబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అల్లుఅర్జున్ కూడా ఈ మూడు షేడ్స్ కోసం తన లుక్, మేనరిజమ్స్, యాక్టింగ్‌లో పూర్తిగా కొత్త వేరియేషన్స్ చూపించబోతున్నారనే టాక్ ఉంది. ఒక పాత్రలో పూర్తిగా రఫ్ అండ్ రా లుక్‌లో..మరో పాత్రలో స్టైలిష్‌గా..ఇంకో పాత్రలో ఇప్పటివరకు చూడని డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈ మూడు పాత్రలు ఎందుకు ఒకేలా కనిపిస్తాయి.? వాళ్ల జీవితాల్లో ఒకే విధమైన సంఘటనలు ఎందుకు జరుగుతాయి.? చివరికి ఈ ముగ్గురి కథలు ఎలా కలుస్తాయి.? అన్నదే రాకాలో అసలు సస్పెన్స్ అంటున్నారు. నిజంగా ఇదే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కితే..ఒకే హీరోలో మూడు షేడ్స్‌ను చూపించడమే కాదు, మూడు వేర్వేరు కథలను ఒకే కథగా మలిచే ప్రయోగంగా రాకా నిలిచే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
