Allu Arjun : పొలిటికల్ లీడర్‌గా బన్నీ!
లోకేష్ కనగరాజ్, అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Gossip Garage Allu Arjun Upcoming Movie Updates
Allu Arjun : లోకేష్ కనగరాజ్, అల్లు అర్జున్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ కాంబోపై ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండగా లేటెస్ట్గా వినిపిస్తున్నఓ గాసిప్.. వాటిని మరింత పీక్స్‌కు చేర్చింది. ఈ మూవీలో అల్లు అర్జున్ ఒక యంగ్ పొలిటికల్ లీడర్‌గా కనిపించబోతున్నాడని టాక్.
సాధారణ రాజకీయ కథ కాకుండా.. సిస్టమ్‌లో ఉన్న లోపాలను ఎక్స్పోజ్ చేస్తూ పబ్లిక్ కోసం పోరాడే పవర్ఫుల్ క్యారెక్టర్‌గా డిజైన్ చేశారట. లోకేష్ స్టైల్లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, హైఇంటెన్స్ మూమెంట్స్‌తో పూర్తిగా న్యూ షేడ్‌లో ఈ క్యారెక్టర్ ఉండబోతుందని టాక్. ఐతే ఈ ప్రాజెక్ట్‌లో మరో ట్విస్ట్ ఉందట.
Alia Bhatt : కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అలియా అందాలు..
కథ కొంతవరకు రియల్ పొలిటికల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఉండొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. యూత్ పాలిటిక్స్, కార్పొరేట్ ఇన్ఫ్లూయెన్స్, ఎలక్షన్ స్ట్రాటజీస్ చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు. తన సినిమాలకు లోకేశ్ రియలిస్టిక్ టచ్ ఇస్తుంటాడు. ఈ సినిమా కూడా రా అండ్ ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయ్. ఇదే నిజం అయితే.. అల్లు అర్జున్ కెరీర్లో ఇది ఒక డిఫరెంట్, బోల్డ్ స్టెప్‌గా నిలిచిపోవడం ఖాయం.
