Prabhas : తాతగా ప్రభాస్ అదరగొడతాడట!
ది రాజా సాబ్ సినిమాలో హీరో ప్రభాస్ తాతగా, ఆత్మగా కనిపిస్తూ అల్లరి చేయబోతున్నాడట.

Gossip Garage Prabhas as Grand Father Raja Saab movie
టాలీవుడ్‌లో అతనో పెద్ద స్టార్ హీరో.. అంతేకాదు పాన్ ఇండియా సెన్సేషన్స్ లో ఒకరు. ఇప్పుడు మొదటిసారి తాత పాత్రలో నటిస్తున్నాడా? సినిమాలో తాతగా, మనవడిగా రెండు పాత్రల్లో సిల్వర్ స్క్రీన్ పై తళుక్కున మెరవబోతున్నాడా? ఇంతకీ ఆ హీరో ఎవరు?
అతను మరెవరో కాదు.. మన యంగ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ది రాజా సాబ్ సినిమాలో హీరో ప్రభాస్ తాతగా, ఆత్మగా కనిపిస్తూ అల్లరి చేయబోతున్నాడట. ప్రభాస్ కెరీర్ లోనే ఫస్ట్ టైం హారర్ కామెండీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఒక రొమాంటిక్ హారర్ కామెడీ, ఓ పాత థియేటర్ నేపథ్యంలో సాగుతుందన్న టాక్ వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో అభిమానులను ఆశ్చర్యపరచబోతున్నాడట.
మారుతి దర్శకత్వంలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. చిత్రంలో నటించేందుకు బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ కూడా ఇప్పటికే హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో హీరో ప్రభాస్ ఇంకా జాయిన్ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో సమ్మర్ వెకేషన్ రెస్ట్ లో ఉన్నారు. ఇటలీ నుంచి ప్రభాస్ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేయడానికి డైరెక్టర్ మారుతి సన్నహాలు చేస్తున్నారట.