Govinda Suffers Bullet Injury At Home After Misfire From Licensed Revolver
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందకు తీవ్రగాయాలు అయ్యాయి. మంగళవారం ఉదయం 4.45 గంటల సమయంలో అతడి కాలికి బుల్లెట్ గాయమైంది. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంంది.
అసలు గోవిందకు బుల్లెట్ గాయం ఎలా అయిందని అనే విషయం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. వీటిపై గోవిందా మేనేజర్ స్పందించారు. మంగళవారం కోల్‌కతాలో ఓ ప్రదర్శన ఉండడంతో గోవిందా కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. తన ఇంట్లోంచి విమానాశ్రయానికి బయలు దేరే సమయంలో తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను తీసుకువెళ్లడానికి దాన్ని తీస్తుండగా ప్రమాద వశాత్తు జారీ కిందపడడంతో అతడి కాలికి గాయమైంది.
వెంటనే అతడిని క్రిటికేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. అని గోవింద మేనేజర్ చెప్పారు. అభిమానులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
కాగా.. ఘటన జరిగిన సమయంలో గోవింద జుహులోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు తెలిపారు.
Tejaswi Madivada : ‘జంగిల్ రాణి’ టైటిల్ కోసం బాలీవుడ్ షోలో దూసుకుపోతున్న తెలుగు హీరోయిన్..