ఆహా.. అనిపిస్తున్న యాప్: OTT రంగంలో సరికొత్త రికార్డులు

  • Published By: vamsi ,Published On : March 9, 2020 / 01:31 PM IST
ఆహా.. అనిపిస్తున్న యాప్: OTT రంగంలో సరికొత్త రికార్డులు

Updated On : March 9, 2020 / 1:31 PM IST

లోక‌ల్ కంటెంట్‌ని ప్ర‌పంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే ఉద్ధేశ్యంతో.. వంద శాతం తెలుగు వెబ్ సిరీస్‌ల‌తో పాటు తెలుగు సినిమాలను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న OTT ఫ్లాట్ ఫామ్ ఆహా.. కొత్తదనం, నావెల్టీ.. అడ్వంచరస్, బోల్డ్ కంటెంట్‌ని ఆదరించేవారి కోసం నెల క్రితం OTT రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆహా.. ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది.

Aha

ఇటీవ‌ల ప్రారంభంమైన ఈ ఓటీటీకి అనూహ్య ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. మార్కెట్‌లోకి వచ్చిన నెలరోజుల్లోపే హయ్యెస్ట్ నంబర్ యూజర్లను గ్రాబ్ చేసిన ఆహా..డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో అతి తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసి.. ప్రేక్షకులతో ఆహా అనిపిస్తోంది. ఉగాది రోజున పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు ఈ ఆహా.. అందుబాటులోకి రానుంది.

Aha

ఓటీటీ ప్రివ్యూని ఫిబ్ర‌వ‌రి 8న ఏర్పాటు చేసి `ఆహా`ని మొద‌లుపెట్టిన తర్వాత రెండు వారాల్లోనే 5లక్షలమంది ఆహా యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోగా.. ఇప్పటివరకు 6లక్షల 71వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఓటీటీ రంగంలో సరికొత్త రికార్డులతో దూకుడుగా దూసుకెళ్తున్న ‘ఆహా’ తొందర్లోనే వన్ మిలియన్ మార్క్ టచ్ చేస్తుందని అంటున్నారు. 

`ఆహా`లో `కొత్త పోర‌డు, మ‌స్తీస్‌, షిట్ హెపెన్స్‌, గీతా సుబ్ర‌మ‌ణ్యం, వంటి వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుండగా.. సోషల్ మీడియాలో కూడా ఈ వెబ్ సిరీస్‌ల గురించి చర్చ జరుగుతంది. ఈ క్రమంలో యాప్‌ని ఈ నెల 25న ఉగాది సంద‌ర్భంగా భారీ స్థాయిలో లాంచ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో ఇండ‌స్ట్రీకి సంబంధించిన సెల‌బ్రిటీలంతా పాల్గొంటార‌ని సమాచారం.

Kotha Poradu

అంతేకాదు.. ఆహా.. యాప్‌లో కంటెంట్‌ని ఒక్కో యూజర్  చూసే వాచ్ టైమ్ 36 నిమిషాలకు పైన ఉందని, 20లక్షల మంది యాక్టివ్ యూజర్లని సొంతం చేసుకున్న ఆహా.. లో 2కోట్ల 43లక్షల 13వేల 661 నిమిషాల స్ట్రీమింగ్‌ని వ్యూయర్స్ వాచ్ చేసారు. నెలరోజుల్లోనే  ఆహా.. ఇంత పాపులర్ అవడానికి కారణం ఇందులోని ఒరిజినల్ కంటెంట్.

ఇక వెబ్ సిరీస్‌లతో పాటు అర్జున్ సురవరం, ఖైదీ, ప్రెషర్ కుక్కర్ లాంటి లేటెస్ట్ ఫ్లిక్స్‌ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగు ఆడియెన్స్ నుంచి వస్తోన్న ఈ బంపర్ రెస్పాన్స్‌తో ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ఇతర ప్లేయర్లకు దీటుగా సత్తా చాటేందుకు రెడీ అయింది. మార్చి 25న, తెలుగువారి కొత్త ఏడాది పండుగ ఉగాది రోజున ఇండస్ట్రీ ప్రముఖులు.. సెలబ్రెటీలు సమక్షంలో పూర్తి స్థాయిలో అఫిషియల్‌గా ఆహా.. యాప్‌ని లాంచ్ చేస్తున్నారు. 

Aha