Guneet Monga : రెండు సార్లు ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ..

ఆస్కార్ నిరీక్షణ ముగిసింది. నేడు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా మొదలైన 95వ ఆస్కార్ అవార్డుల్లో RRR, 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ అందుకున్నాయి. ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాన్ని నిర్మించిన గునీత్ మోంగా..

Guneet Monga : ఆస్కార్ నిరీక్షణ ముగిసింది. నేడు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా మొదలైన 95వ ఆస్కార్ అవార్డు వేడుకలకు ప్రపంచంలోని తారలు కదిలివచ్చారు. ఇంత ప్రతిష్టాత్మకమైన వేడుకను మన తెలుగు సాంగ్ ‘నాటు నాటు’ స్టెప్ తోనే మొదలు పెట్టడం విశేషం. ఇక ఈ ఏడాది ఆస్కార్ కి ఇండియా తరుపు నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘RRR’, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, బెస్ట్ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘అల్ దట్ బ్రీత్స్’ నామినేట్ అయ్యాయి.

The Elephant Whisperers : ఆస్కార్ గెలిచిన ఇండియన్ సినిమా.. చరిత్ర సృష్టించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్!

వీటిలో ‘అల్ దట్ బ్రీత్స్’ ఆస్కార్ అందుకోలేక పోయింది. ఇక RRR నాటు నాటు సాంగ్ కి గాను ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అందుకొని మొదటి ఇండియన్ సినిమాగా నిలిచింది. అలాగే ఆస్కార్ రేస్ లో ఉన్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రం కూడా ఆస్కార్ అందుకుంది. ఈ చిత్రాన్ని కార్తిక్ గోన్సాల్వేస్ డైరెక్ట్ చేయగా, గునీత్ మోంగా నిర్మించింది. గునీత్ మోంగా ప్రముఖ ఇండియన్ ఫిలిం ప్రొడ్యూసర్. ఈమె నిర్మించిన పలు సినిమాలు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వేదికల్లో స్థానం దక్కించుకున్నాయి.

Oscars95 : ఇండియన్ ఫిలిం ‘అల్ దట్ బ్రీత్స్’కి మిస్ అయ్యిన ఆస్కార్..

అలాగే ఆస్కార్ వేదిక పై కూడా ఈమె నిర్మించిన చిత్రాలు సత్తా చాటాయి. మోంగా నిర్మించిన మొదటి ఇంటర్నేషనల్ ఫిలిం ‘కవి’.. 2009 లో ఆస్కార్ కి బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో నామినేట్ అయ్యింది. అయితే అప్పుడు ఆస్కార్ గెలుచుకోలేక పోయింది. కానీ 10 ఏళ్ళ తరువాత 2019 లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ‘పీరియడ్ – ఎండ్ అఫ్ సెంటెన్స్’ కి అవార్డుని అందుకుంది మోంగా. అయితే అప్పుడు ఆ చిత్రానికి ఆమె సహా నిర్మాత మాత్రమే. కానీ ఇప్పుడు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కి నిర్మాతగా ఆస్కార్ ని అందుకున్నారు. ఏదేమైనా గునీత్ మోంగా రెండుసార్లు ఆస్కార్ అందుకొన్న భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు అనే చెప్పాలి.

ట్రెండింగ్ వార్తలు