Guppedantha Manasu Serial : ఆసుపత్రిలో ఉన్న జగతి ప్రాణాలతో బయటపడుతుందా? గుప్పెడు మనసు సీరియల్‌లో ఏం జరగబోతోంది?

రిషికి కొన్ని నిజాలు చెప్పి ఇంటికి తీసుకురావాలని.. రిషిని, వసుధరని ఒక్కటి చేయాలని బయలుదేరిన జగతి ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉంటుంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? జగతి ప్రాణాలతో బయటపడుతుందా?

Guppedantha Manasu Serial : ఆసుపత్రిలో ఉన్న జగతి ప్రాణాలతో బయటపడుతుందా? గుప్పెడు మనసు సీరియల్‌లో ఏం జరగబోతోంది?

Guppedantha Manasu Serial

Updated On : September 26, 2023 / 2:09 PM IST

Guppedantha Manasu Serial : ధరణి వసుధరకు ఫోన్ చేసి రిషి ప్రమాదంలో ఉన్నాడని చెబుతుంది. రిషిని కలవడానికి వెళ్లిన జగతి ప్రాణాపాయంలో చిక్కుకుంటుంది. అసలు ‘గుప్పెడు మనసు’ సీరియల్‌లో  ఏం జరగబోతోంది?

Paluke Bangaramayana : పలుకే బంగారమాయెనా.. సరికొత్త సీరియల్.. కలలను సాధించే ప్రయాణం..

‘గుప్పెడు మనసు’ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈరోజు ఎపిసోడ్ మరింత ఉత్కంఠ కలిగించబోతోంది. కాలేజ్‌లో ఉన్న వసుధరకు ధరణి ఫోన్ చేసి తన భర్త శైలేంద్ర కారణంగా రిషి ప్రమాదంలో పడ్డాడని అతను ఎక్కడ ఉన్న వెంటనే కాపాడమని చెబుతుంది. ఆమె మాటలు విన్న వసుధర ఆందోళనకు గురౌతుంది. పాండ్యన్ ద్వారా రిషికి ఫోన్ చేయించి అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అతనిని కాపాడటానికి వెళ్తుంది.

మరోవైపు రిషికి కొన్ని నిజాలు చెప్పి అతని ఇంటికి తీసుకురావడంతో పాటు రిషిని, వసుధరని ఒక్కటి చేయాలనుకుంటుంది జగతి. అందుకోసం రిషిని కలవడానికి బయలుదేరుతుంది. రిషి, జగతి కలుసుకుంటారు. తనను కలవమనడానికి కారణం చెప్పమని రిషి జగతిని అడుగుతాడు. ఈలోగా రిషిని చంపడానికి శైలేంద్ర పురమాయించిన వ్యక్తి అక్కడికి చేరుకుని గన్‌తో షూట్ చేయడానికి రెడీ అవుతాడు. వసుధర, పాండ్యన్ అక్కడికి చేరుకుంటారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని కంగారు పెడతారు. ఈలోగా గన్ గురి చేసిన వ్యక్తి రిషీని షూట్ చేసేంతలో జగతి రిషికి అడ్డం రావడంతో బుల్లోట్ ఆమె గుండెల్లో దిగుతుంది. కుప్పకూలిపోయిన జగతిని ఆసుపత్రికి తీసుకెళ్తారు.

Viral Video: ప్రేక్షకులకు షాకిస్తున్న సీరియల్స్.. ఈ సీన్ చూస్తే హడలే… ఏకంగా తాడుతో చంద్రుడ్నే కిందకు లాగారు..!

జగతిని చూడటానికి మహేంద్ర ఆందోళనగా ఆసుపత్రికి చేరుకుంటాడు. రిషి, వసుధర, పాండ్యన్ అందరూ ఆసుపత్రిలో విచారంగా ఉంటారు. డాక్టర్ వచ్చి జగతి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని చెబుతాడు. రిషి కోపంగా డాక్టర్ కాలర్ పట్టుకుంటాడు. అంతలోనే తమాయించుకుని డాక్టర్‌ని ఎలాగైన జగతిని బ్రతికించమని రిక్వెస్ట్ చేస్తాడు. ఇక ఆసుపత్రిలో ఉన్న జగతి ప్రాణాలతో బయటపడుతుందా? రిషికి చెప్పాలనుకున్న నిజం చెబుతుందా? ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది.