పర్సనల్ ఫొటోస్ లీక్ : స్పందించిన హన్సిక

హన్సిక ప్రైవేట్ ఫొటోలు లీకయ్యాయనే వార్త వైరల్ అవ్వటంతో హన్సిక రెస్పాండ్ అయ్యింది.  

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 07:47 AM IST
పర్సనల్ ఫొటోస్ లీక్ : స్పందించిన హన్సిక

హన్సిక ప్రైవేట్ ఫొటోలు లీకయ్యాయనే వార్త వైరల్ అవ్వటంతో హన్సిక రెస్పాండ్ అయ్యింది.  

ముంబై : హీరోయిన్ హన్సిక పర్సనల్ ఫొటోస్ లీక్ అయ్యాయి. ఇప్పుడా ఫొటో స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. న్యూయార్క్‌లో హాలీడేను ఎంజాయ్ చేసినప్పటి హీరోయిన్ హన్సిక వ్యక్తిగత ఫొటోలను హ్యాకర్లు లీక్ చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ అండ్ వైట్ కలర్స్ బికినీలో ఉన్న హన్సిక ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో చక్కర్లు కొట్టాయి. వాస్తవానికి ఈ ఫొటోలను హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో పెట్టలేదట. యూజర్సే ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో హన్సిక ప్రైవేట్ ఫొటోలు లీకయ్యాయనే వార్త వైరల్ అవ్వటంతో హన్సిక రెస్పాండ్ అయ్యింది.  

తన ఫోన్, ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యాయనీ..దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలని..తన ట్విట్టర్ లో వచ్చే మెజేస్ లకు స్పందించవద్దని కోరింది. ఈ పరిస్థితి సెట్ చేసేందుకు తన టీమ్ ప్రయత్నిస్తోందనీ హన్సిక తెలిపింది. కాగా స్టార్ హీరోయిన్ల వ్యక్తిగత ఫొటోలు లీక్ కావడం కొత్త కాదు.అమీ జాక్సన్, అక్షర హాసన్ మొబైల్‌లో ఉన్న ఫొటోలను హాకర్లు ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. తన ఫొటోలను లీక్ చేసిన హ్యాకర్లపై ముంబై పోలీసులకు అక్షర కంప్లైంట్ చేసింది కానీ హన్సిక మాత్రం పోలీస్ కంప్లైంట్ చేయలేదు.