హ్యాపీ బర్త్‌డే అల్లు అర్హ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల తనయ అల్లు అర్హ.. నవంబర్ 21 నాటికి మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది..

  • Published By: sekhar ,Published On : November 21, 2019 / 09:08 AM IST
హ్యాపీ బర్త్‌డే అల్లు అర్హ

Updated On : November 21, 2019 / 9:08 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల తనయ అల్లు అర్హ.. నవంబర్ 21 నాటికి మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల తనయ అల్లు అర్హ పుట్టినరోజు నేడు (నవంబర్ 21).. ఈ ఏడాదితో అర్హ మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా బన్నీ ఫ్యామిలీ అర్హ బర్త్‌డే ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. బర్త్‌డే బేబి అర్హ క్యూట్ పిక్స్ భలే ఉన్నాయి. ముద్దులొలికే చిరునవ్వుతో ఉన్న అర్హ పిక్స్ సోషల్ మీడియాలో ఈ ఉదయం నుంచి బాగా వైరల్ అవుతున్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’ మూవీలోని ‘ఓ మై గాడ్ డాడీ’ సాంగ్ టీజర్ చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14వ తేదీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. టీజర్‌లో బన్నీ కుమార్తె అర్హ, కుమారుడు అయాన్ కనిపించి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. అయాన్, అర్హల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ముద్దు ముద్దు స్టెప్పులు చూసి అందరూ మురిసిపోతున్నారు.

Read Also : పూరి పెద్దమనసు : పునాదిరాళ్లు దర్శకులు రాజ్ కుమార్‌కు ఆర్థిక సహాయం

అలాగే చిల్డ్రన్స్ డే నాడు బన్నీ భార్య స్నేహా రెడ్డి పిల్లలిద్దరూ కలిసి ఉన్న పిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.. అన్నాచెల్లెల్లు క్యూట్ఎక్స్‌ప్రెషన్స్‌తో భలే ఉన్నారు. ఈ ఫోటోకు విపరీతంగా లైకులు, కామెంట్లు వస్తున్నాయి..