పెదనాన్న బర్త్ డేకి.. అబ్బాయి గిఫ్ట్

  • Published By: veegamteam ,Published On : August 22, 2019 / 05:17 AM IST
పెదనాన్న బర్త్ డేకి.. అబ్బాయి గిఫ్ట్

Updated On : August 22, 2019 / 5:17 AM IST

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటున్న ఫ్యాన్స్ కు పండగ రోజు. ఇక ఫ్యామిలీకి అయితే మరింత ప్రత్యేకం. పెదనాన్న బర్త్ డేకి.. నాగబాబు కుమారుడు, హీరో వ‌రుణ్ తేజ్  అదిరిపోయే బహుమతి ఇచ్చారు. తన కొత్త సినిమా వాల్మీకి మూవీ సాంగ్ రిలీజ్ చేసి.. ఫ్యాన్స్ కు మరింత జోష్ తీసుకొచ్చారు వరుణ్.

హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మికీ మూవీ చేస్తున్నాడు తేజ్. మూవీ గెటప్ చూసి అందరూ షాక్ అయ్యారు. పక్కా మాస్ గా కనిపిస్తున్నాడు. కోలీవుడ్ సూప‌ర్ హిట్ జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతుంది. చిరు పుట్టినరోజు బహుమతిగా.. వరుణ్ వాల్మికీ మూవీలోని జ‌ర్ర జ‌ర్ర సాంగ్ ప్రోమో విడుద‌ల చేశారు. ఈ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల‌కి బాగా నచ్చుతుంది. ఇందులో డింపుల్ హ‌యాతి వేసే స్టెప్పులు అద్దిరిపోయాయి.

14 రీల్స్ సంస్థ రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి సినిమాని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. అధ‌ర్వ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హరీష్ శంకర్.. ఈ రీమేక్ మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.