Hari Hara Veera Mallu Glimpse To Be Out On New Year Day
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో పవన్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’పై ప్రొడ్యూసర్ కామెంట్స్.. ఏమన్నాడంటే?
ఇక చిత్ర యూనిట్ ఇటీవల ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించింది. ఈ యాక్షన్ ఎపిసోడ్ 45 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, తాజాగా న్యూ ఇయర్ కానుకగా వీరమల్లు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. ఈ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించి ఓ వీడియో గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Hari Hara Veeramallu: పవన్ హిస్టారికల్ సినిమా.. యాక్షన్ రిహార్సల్స్ వీడియో రిలీజ్!
ఈ యాక్షన్ ఎపిసోడ్‌లో పవన్ గడ్డంతో కనిపిస్తాడని తెలుస్తోంది. కాగా, డిసెంబర్ 31న ‘ఖుషి’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన పవన్, ఇప్పుడు వీరమల్లు వీడియో గ్లింప్స్‌తో డబుల్ బొనాంజా ఇవ్వనున్నాడని చిత్ర వర్గాల్లో వినిపిస్తుండటంతో.. అభిమానులు ఈ వీడియో గ్లింప్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఆసక్తిగా చూస్తున్నారు.