Pawan Kalyan – Harish Shankar : పవన్ రియల్ పొలిటికల్ సీన్.. ఉస్తాద్ భగత్ సింగ్ లో.. హరీష్ శంకర్ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే..

ఉస్తాద్ భగత్ సింగ్ ని అందరూ ఎప్పుడో మర్చిపోయారు. ఆ సినిమా పవన్ చేస్తాడని కూడా ఎవరికీ నమ్మకం లేదు.

Pawan Kalyan – Harish Shankar : పవన్ రియల్ పొలిటికల్ సీన్.. ఉస్తాద్ భగత్ సింగ్ లో.. హరీష్ శంకర్ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే..

Harish Shankar Reveals Interesting Scene from Pawan Kalyan Ustaad Bhagat Sing Movie

Updated On : February 17, 2025 / 9:16 AM IST

Pawan Kalyan – Harish Shankar : పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అవ్వడంతో సినిమాలకు డేట్స్ ఇచ్చే ఖాళీ లేకపోవడంతో ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు ఈ సమ్మర్ కి వచ్చేస్తుంది. ఫ్యాన్స్ మాత్రం OG కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ని అందరూ ఎప్పుడో మర్చిపోయారు. ఆ సినిమా పవన్ చేస్తాడని కూడా ఎవరికీ నమ్మకం లేదు. కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ – నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఈ సినిమా ఉందనే అంటున్నారు. ఇప్పటికే ఓ రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తిచేశారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్లో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని ఫ్యాన్స్ పండగచేసుకునే ఓ సీన్ గురించి చెప్పారు.

Also Read : Venky Atluri : మళ్ళీ బయటి హీరోతోనే.. ఈ డైరెక్టర్ పని బాగుందిగా.. ఇంకో హిట్ పక్కా..

లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాధన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేస్తుండగా నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హరీష్ శంకర్ గెస్ట్ గా వచ్చాడు. అయితే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయనతో సినిమా చేయాలని, ఆయన రియల్ లైఫ్ లో కార్ మీద కూర్చొని వెళ్లిన సీన్ చూసి నేను షాక్ అయ్యాను. ఆ మాస్ సీన్ ఆయనతో సినిమాలో రీ క్రియేట్ చేయాలని అన్నారు.

Also Read : Daali Dhananjaya : పెళ్లి చేసుకున్న పుష్ప నటుడు.. డాలి ధనంజయ పెళ్లి ఫొటోలు చూశారా?

ఈ విషయంపై హరీష్ శంకర్ మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అని అందరికి తెలిసిందే. ఆయనతో నేను చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఆ కార్ సీన్ ఆల్రెడీ పెట్టేసాను. రియల్ లైఫ్ లో పవన్ గారు కార్ మీద కూర్చొని వెళ్లే సీన్ ఆల్రెడీ ఉస్తాద్ సినిమాలో రాసుకున్నాను. ఈ సినిమాలో ఆ సీన్ ఉంటుంది అని చెప్పారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ సీన్ రియల్ గా, టీవీ, యూట్యూబ్ లలో చూసే అంతా షాక్ అయ్యారు. ఇక అదే సీన్ 70mm స్క్రీన్ మీద పవన్ అలా కార్ మీద కూర్చొని వెళ్తూ మాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చూస్తే అదిరిపోతుంది అని, ఓ రేంజ్ ఎలివేషన్ అని అని ఫ్యాన్స్ అంటున్నారు. హరీష్ శంకర్ మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మాట్లాడటంతో ఈ సినిమా కాస్త లేట్ అయినా ఉంటుందని అనుకుంటున్నారు.