Venky Atluri : మళ్ళీ బయటి హీరోతోనే.. ఈ డైరెక్టర్ పని బాగుందిగా.. ఇంకో హిట్ పక్కా..
టాలీవుడ్ డైరెక్టర్ అయితే బయట హీరోలతోనే సినిమాలు చేసి హిట్స్ కొడుతున్నాడు.

Tollywood Director Planning Telugu Movie with Suriya target for Hat trick
Venky Atluri : టాలీవుడ్ స్థాయి పాన్ ఇండియాకు పెరిగిపోవడంతో ఇక్కడి దర్శకులపై వేరే సినీ పరిశ్రమలలోని హీరోలకు బాగా నమ్మకం వచ్చేసింది. అందుకే వేరే సినీ పరిశ్రమ హీరోలు మన దర్శకులతో పోటీ పడీ మరీ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక టాలీవుడ్ డైరెక్టర్ అయితే బయట హీరోలతోనే సినిమాలు చేసి హిట్స్ కొడుతున్నాడు.
డైరెక్టర్ వెంకీ అట్లూరి నటుడిగా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా మొదటి సినిమా తొలిప్రేమ మంచి హిట్ వచ్చినా ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు రెండూ యావరేజ్ గానే నిలిచాయి. అతని మేకింగ్ స్టైల్ పై కూడా ట్రోల్స్ వచ్చాయి. ఒక లవ్ స్టోరీని ఫస్ట్ హాఫ్ ఇండియాలో సెకండ్ హాఫ్ ఇంకో దేశంలో రెగ్యులర్ గా ఇదే తీస్తున్నాడు అని ట్రోల్స్ వచ్చాయి.
Also Read : Daali Dhananjaya : పెళ్లి చేసుకున్న పుష్ప నటుడు.. డాలి ధనంజయ పెళ్లి ఫొటోలు చూశారా?
దీంతో ధనుష్ తో సితార ఎంటెర్టైన్మెట్స్ లో ‘సర్’ సినిమా చేసి పెద్ద హిట్ కొట్టాడు. ఒక మంచి ఫ్రెష్ కంటెంట్ తీసుకొని ఒక మెసేజ్ కూడా ఇస్తూ తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేసి పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో ‘లక్కీ భాస్కర్’ సినిమా తీసి మరో హిట్ కొట్టాడు. ఈ సినిమా అయితే తెలుగు వాళ్లకు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ కి బాగా కనెక్ట్ అయిపొయింది. దీంతో తన స్టైల్ ఆఫ్ మేకింగ్ మార్చి బయటి హీరోలతో సినిమాలు తీసి హిట్స్ కొడుతున్నాడు వెంకీ అట్లూరి అని అంటున్నారు.
లక్కీ భాస్కర్ సినిమా సక్సెస్ ప్రమోషన్స్ లో కూడా మళ్ళీ వేరే సినీ పరిశ్రమల హీరోతోనే సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. తాజాగా వెంకీ అట్లూరి నెక్స్ట్ సినిమా పై రూమర్స్ వినిపిస్తున్నాయి. తనకు వరుసగా రెండు హిట్స్ ఇచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే వెంకీ అట్లూరి నెక్స్ట్ సినిమా తమిళ్ స్టార్ హీరో సూర్యతో ఉండబోతుందని టాలీవుడ్ లో వినిపిస్తుంది.
సూర్య తమిళ్ హీరో అయినా తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇటీవల సూర్య వరుస ఫ్లాప్స్ చూస్తున్నాడు. ప్రస్తుతం సూర్య రెట్రో సినిమాతో పాటు మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు అయ్యాక సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా వెంకీ అట్లూరితోనే ఉంటుందని వినిపిస్తుంది. ప్రస్తుతం వెంకీ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. దీంతో వెంకీ అట్లూరి మరోసారి బయటి హీరోతో సినిమా చేసి హ్యాట్రిక్ హిట్ కొడతాడు అని అంటున్నారు.
ఎప్పట్నుంచో సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనీ కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. గతంలో సూర్య 15 ఏళ్ళ క్రితం ఆర్జీవీ దర్శకత్వంలో రక్త చరిత్ర 2లో నటించాడు. మళ్ళీ ఇన్నేళ్లకు డైరెక్ట్ తెలుగు సినిమా తీయబోతున్నాడు అని సమాచారం. ఇక సూర్యతో తండేల్ డైరెక్టర్ చందు మొండేటి కూడా సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అలాగే బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో వెంకీ అట్లూరి సినిమా ఉంటుందని కూడా వినిపిస్తుంది.