Harsha Sai : మొదటి మూవీకే ‘మెగా’ టైటిల్‌ని తీసుకున్న యూట్యూబర్ హర్ష సాయి.. టీజర్ చూశారా..?

యూట్యూబర్ హర్ష సాయి హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న మొదటి మూవీ టైటిల్ టీజర్ వచ్చేసింది.

Harsha Sai : మొదటి మూవీకే ‘మెగా’ టైటిల్‌ని తీసుకున్న యూట్యూబర్ హర్ష సాయి.. టీజర్ చూశారా..?

Harsha Sai Mitraaw new movie MEGA title teaser released

Updated On : September 17, 2023 / 5:23 PM IST

Harsha Sai : యూట్యూబర్ హర్ష సాయి ఇటీవల ఒక సినిమా ప్రకటించి అందర్నీ థ్రిల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ ని మరింత థ్రిల్ కి ఫీల్ అయ్యేలా చేశాడు. దాదాపు మూడు నిముషాలు పాటు టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశాడు. టీజర్ ని పూర్తి మాస్ గా తెరకెక్కించారు. అలాగే సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీకి ‘మెగా’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. ఇక ఆ టైటిల్ కి క్యాప్షన్ గా.. ‘లో డాన్’ అని పెట్టారు.

Mega 157 : చిరంజీవికి జోడిగా అనుష్క.. సెట్ చేస్తున్న యూవీ క్రియేషన్స్.. నిజమేనా..?

మొత్తంమీద టైటిల్.. ‘మెగా లో డాన్’ అని పెట్టారు. మొదటి మూవీకే ‘మెగా’ అనే టైటిల్‌ని పెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. కాగా ఈ మూవీకి కథని హర్ష సాయి అందిస్తూ డైరెక్షన్ భాద్యతలు కూడా తీసుకున్నాడు. బిగ్‌బాస్ బ్యూటీ మిత్ర శర్మ తన సొంత బ్యానర్ శ్రీ పిక్చర్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మొదటి సినిమాతోనే హర్ష సాయి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. మరి ఈ మూవీ టైటిల్ టీజర్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.

kamal Haasan : కమల్ గడ్డం పెంచడం వెనుక సీక్రెట్ అదే.. మణిరత్నంతో సినిమాపై అప్ డేట్ ఇచ్చేసాడు

ఇక ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ మరియు ఇతర టెక్నీషియన్స్ గురించి తెలియాల్సి ఉంది. కాగా ఈ మూవీ టైటిల్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హర్ష సాయి.. సినిమా జర్నలిస్ట్ ల సంఘానికి భారీ విరాళం ఇచ్చినట్లు సమాచారం. ఇన్నాళ్లు సామాన్య ప్రజలకు డబ్బులు, బహుమతులు ఇస్తూ సోషల్ మీడియాలో ఎంతో స్టార్‌డమ్ ని సంపాదించుకున్న హర్ష సాయి.. ఇప్పుడు సినీ రంగంలో కూడా అలాంటి ఫేమ్ నే సంపాదించుకుంటాడా అనేది చూడాలి.