కంగానా…నీ గట్స్ కు హ్యాట్సాఫ్ : భగత్ సింగ్ లా పోరాడుతున్నాతున్నావంటూ విశాల్ ప్రశంసలు

మహారాష్ట్ర గవెర్నమెంట్ వర్సెస్ కంగనా రనౌత్ గా కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. బుధవారం అక్రమ నిర్మాణ అంటూ ముంబైలోని కంగనా ఇంటిని బీఎంసీ అధికారులు పాక్షికంగా కూల్చివేయడంపై రచ్చ తారాస్థాయికి చేరింది.
ఈ నేపథ్యంలో ఇవాళ కంగనాకు మద్దతుగా నిలుస్తూ ఆమెపై ప్రశంసలు కురిపించారు కోలీవుడ్ నటుడు విశాల్. నీ ధైర్యానికి, తెగింపుకు హ్యాట్సాఫ్ కంగనా. తప్పును తప్పును అని చెప్పడానికి ఒప్పును ఒప్పని చెప్పడానికి నువ్ ఎప్పుడూ ఆలోచించలేదు.. వెనకడుగు వేయలేదు. అది నీ వ్యక్తిగత విషయం కాకపోయినా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డావ్. ఎంతో ధైర్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నావ్.
నాడు 1920లో భగత్ సింగ్ చేసినట్టుగా నేడు నువ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ప్రశ్నించడానికి ప్రజలు ఎదురుతిరిగేందుకు నిన్ను ఉదాహరణగా తీసుకుని నిలిచే ఘట్టమవుతుంది. ఇలా ప్రభుత్వాలను ఎండగట్టేందుకు సెలెబ్రిటీలే కానక్కర్లేదు కామన్ మ్యాన్‌లా కూడా పోరాడొచ్చని చాటి చెబుతున్నావ్. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ (ఆర్టికల్ 19). కుదోస్ టు యూ.. నీ ముందు మోకరిల్లుతాను.. అంటూ విశాల్ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ ను ఉంచారు.
Dear @KanganaTeam pic.twitter.com/73BY631Kkx
— Vishal (@VishalKOfficial) September 10, 2020