Thank You Dear
Thank You Dear : మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ లో తోట శ్రీకాంత్ కుమార్ దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా థ్యాంక్యూ డియర్. హెబ్బా పటేల్, త్రంత మూవీ ఫేమ్ ధనుష్ రఘుముద్రి, రేఖ నిరోషా హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ కి ముందు ఈ సినిమా పలు అవార్డులను గెలుచుకుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. రవి ప్రకాశ్, నాగ మహేష్, వీర శంకర్, ఛత్రపతి శేఖర్, మీనాకుమారి, బేబీ ప్రభావతి, బలగం సుజాత, సంక్రాంతి శ్రీనివాస్ నాయుడు, వీనిషా, వర్దిని.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
Also Read : Raviteja : రవితేజ థియేటర్ రెడీ.. ఎక్కడో తెలుసా? విజయ్ దేవరకొండ సినిమాతోనే ఓపెనింగ్..
థ్యాంక్యూ డియర్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ శ్రీకాంత్ తోట మాట్లాడుతూ.. ప్రపంచంలో జరిగే ఒక బర్నింగ్ పాయింట్ ని తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి తెరక్కేకించాము. సినిమాలో కథ ఎంత ముఖ్యమో స్క్రీన్ ప్లే కూడా అంతే ముఖ్యం. ఈ సినిమా అంతా కట్ బ్యాక్ స్క్రీన్ ప్లే లో ఉండబోతుంది. ఒక మంచి సందేశంతో అందరూ కనెక్ట్ అవుతారు. ఇప్పటికే ఈ సినిమాకు చాలా అవార్డులు రావడం విశేషం అని తెలిపారు.
Also See : Chiranjeevi Mouni Roy : విశ్వంభర స్పెషల్ సాంగ్ షూటింగ్ కంప్లీట్.. చిరు, మౌని రాయ్ ఫొటోలు వైరల్..
నిర్మాత బాలాజీ మాట్లాడుతూ.. ఆగస్టు 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని అన్నారు. హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గారితో, రేఖా నిరోషాతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకు స్పెషల్ గా ఉంటుంది అని అన్నారు.