Raviteja : రవితేజ థియేటర్ రెడీ.. ఎక్కడో తెలుసా? విజయ్ దేవరకొండ సినిమాతోనే ఓపెనింగ్..
అదే బాటలో రవితేజ కూడా చేరాడు.

Raviteja
Raviteja : సినిమా వాళ్లంతా ఓ పక్క సినిమాల్లో సంపాదిస్తూనే మరో పక్క బిజినెస్ లలో పెట్టుబడులు పెడతారని తెలిసిందే. ఇటివర మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నితిన్ ఆసియన్ సినిమాస్ తో కలిసి మల్టిప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లోకి దిగారు. ఆ హీరోల థియేటర్స్ అన్ని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాయి. అదే బాటలో రవితేజ కూడా చేరాడు.
మాస్ మహారాజ రవితేజ ART (ఆసియన్ రవితేజ సినిమాస్) అనే మల్టిప్లెక్స్ థియేటర్ ని హైదరాబాద్ వనస్థలిపురంలో నిర్మించాడు. EPIQ స్క్రీన్ టెక్నాలజీతో, డాల్బీ సౌండ్ సిస్టమ్ తో ఆరు స్క్రీన్స్ ఉన్న మల్టిప్లెక్స్ ని నిర్మించారు. ఈ థియేటర్ రేపు జులై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతోనే ఓపెన్ అవ్వనుంది. అయితే ఈ థియేటర్ కి సంబంధిచి బుకింగ్స్ ఇంకా ఆన్లైన్ లో మాత్రం ఓపెన్ అవ్వలేదు.
Also Read : Vijay Deverakonda : నాకు ఆ అదృష్టం లేదు.. కానీ నా తమ్ముడికి.. నెపోటిజంపై విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు..
మల్టిప్లెక్స్ థియేటర్స్ కట్టిన హీరోలు అంతా ఆ బిజినెస్ లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రవితేజ కూడా ఇదే బాటలో సక్సెస్ అవ్వనున్నాడు. వనస్థలిపురం దగ్గర్లో ఈ రేంజ్ క్లాస్ మల్టిప్లెక్స్ థియేటర్స్ లేకపోవడం కూడా కలిసొచ్చి మరింత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.