Vijay Deverakonda : నాకు ఆ అదృష్టం లేదు.. కానీ నా తమ్ముడికి.. నెపోటిజంపై విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు..
కొన్ని రోజుల క్రితం ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజం పై వ్యాఖ్యలు చేసాడు.

Vijay Deverakonda
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ తండ్రి టీవీ పరిశ్రమలో ఉన్నా సినీ పరిశ్రమలో విజయ్ సొంతగానే ఎలాంటి సపోర్ట్ లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వేషాలు వేస్తూ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు స్టార్ హీరోలలోఒకడిగా నిలబడ్డాడు. అయితే కొన్ని రోజుల క్రితం ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజం పై వ్యాఖ్యలు చేసాడు.
కొంతమంది హీరోల తండ్రులు కూడా హీరోలు, వాళ్ళు కథలను వింటారు, వాళ్లకు మంచి టీమ్ ఇస్తారు, వాళ్లకు బెస్ట్ సినిమాలు వస్తాయి. నాకు ఎవరూ లేరు, నాకు వచ్చిన కథలను నేను రిజెక్ట్ చేయలేకపోయాను అంటూ మాట్లాడాడు. అయితే దీనిపై సపోర్ట్ రావడంతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. నేడు కింగ్డమ్ సినిమా ప్రెస్ మీట్ లో విజయ్ ని ఈ వ్యాఖ్యలు తప్పుగా ప్రమోట్ అయ్యాయి అని ప్రశ్నించారు.
Also Read : Kingdom : ‘కింగ్డమ్’ కథ అదేనా.. విశాల్ సినిమా స్టోరీ.. రామ్ చరణ్ కి చెప్పిన కథ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
దీనికి విజయ్ దేవరకొండ సమాధానమిస్తూ.. నేను అన్నది నిజమే కానీ అది పాజిటివ్ గా చెప్పాను. అలా హీరోలకు వెనక ఒకరు ఉండటం మంచిదే. ఏ పరిశ్రమలో అయినా ఒక వ్యక్తి తండ్రి కూడా అదే ఫీల్డ్ లో ఉంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని గైడెన్స్ ఇస్తారు. అది వాళ్ళ అదృష్టం. నాకు ఆ అదృష్టం లేదు. సినిమా ఫీల్డ్ మాత్రమే కాదు ఎందులో అయినా కొడుకులు అదే ఫీల్డ్ లోకి వస్తే చెప్తారు. నా తమ్ముడు ఆనంద్ నన్ను చూసి అర్ధం చేసుకుంటున్నాడు. ఒక అన్నగా నేను ఉండటం ఆనంద్ కి బెనిఫిట్ అవుతుంది అని తెలిపాడు.