Kingdom : ‘కింగ్డమ్’ కథ అదేనా.. విశాల్ సినిమా స్టోరీ.. రామ్ చరణ్ కి చెప్పిన కథ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేసారు.

Kingdom
Kingdom : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో రేపు జులై 31న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ రిలీజయి అంచనాలు నెలకొన్నాయి. అయితే ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేసారు. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం.. ఇద్దరు అన్నదమ్ములు చిన్నప్పుడే విడిపోతే అన్నయ్య ఒక ఏరియాలో రౌడీ అవుతాడు. అన్నయ్యని తీసుకురావడానికి తమ్ముడు వెళ్లి అక్కడ తమ్ముడు ఆ రౌడీలకు లీడర్ గా ఎలా మారాడు అనేది కథ అని తెలుస్తుంది.
అయితే చిన్నప్పుడే అన్నదమ్ములు తప్పిపోవడం, ఒకర్ని వెతుక్కుంటూ ఒకరు వెళ్లడం గతంలో చాలా సినిమాలు వచ్చాయి. విశాల్ పిస్తా అయితే ఆల్మోస్ట్ ఇదే లైన్. తమ్ముడు అన్నయ్యని వెతుక్కుంటూ వెళ్తాడు కానీ అన్నయ్య రౌడీ. అయితే కింగ్డమ్ లో శ్రీలంక బ్యాక్ డ్రాప్ వాడుకున్నారు. క్లైమాక్స్ కూడా మార్చినట్టు తెలుస్తుంది. ఇందులో కూడా అన్నయ్య పాత్రని చంపేయొచ్చు అని ఊహిస్తున్నారు.
Also Read : Vijay Deverakonda : నాకు ఆ విషయంలో భయం.. అందుకే మొదట్లో అగ్రెసివ్ గా మాట్లాడాను.. కానీ ఇప్పుడు..
నేడు కింగ్డమ్ ప్రెస్ మీట్ నిర్వహించగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేసాము. ట్రైలర్ లో ఉన్నదే కథ. ఎలాంటి అంచనాలు లేకుండా రావాలనే కథ రివీల్ చేసేసాము అని తెలిపారు. దీంతో ట్రైలర్ లో చూపించిందే కథ అని అందరికి అర్ధమయింది. మరి దాన్ని విజువల్ గా ఎంత గొప్పగా చూపిస్తారో చూడాలి.
అలాగే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ గతంలో సినిమా ప్రకటించారు కానీ ఆ సినిమా ఆగిపోయింది. అది ఆగిపోయాక గౌతమ్ విజయ్ దేవరకొండతో ఈ కింగ్డమ్ మొదలుపెట్టాడు. దీంతో అందరూ ఈ కథ రామ్ చరణ్ చేయాల్సింది అని అనుకున్నారు. నేడు నిర్మాత దీనిపై కూడా స్పందిస్తూ.. రామ్ చరణ్ కి చెప్పిన కథ ఇది కాదు. ఇది వేరే కథ. గౌతమ్ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడే డైరెక్ట్ విజయ్ తోనే చేద్దాం అని అడిగాడు అని క్లారిటీ ఇచ్చారు.
Also Read : Kingdom Press Meet : ‘కింగ్డమ్’ ప్రెస్ మీట్ ఫొటోలు..