Chiranjeevi : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచన..
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Heavy rains in Telugu states Megastar Chiranjeevi key message to the people
Megastar Chiranjeevi : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది.
దీని ప్రభావంతో నేడు (ఆదివారం) పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్టులను జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజలందరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి కష్ట సమయాల్లో అభిమానులు ఎల్లప్పుడు ప్రజలకు అండగా ఉంటారన్నారు.
నందమూరి ఫ్యామిలీ వార్.. ‘దేవర’ సినిమాపై ఎఫెక్ట్ చూపబోతుందా?
‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను.’ అని చిరంజీవి ట్వీట్ చేశాడు.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం…
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 1, 2024