Dhoom Dhaam : హెబ్బా పటేల్ కొత్త సినిమా ‘ధూం ధాం’ ట్రైలర్ చూశారా..?
ఇప్పటికే ధూం ధాం సినిమా నుంచి పాటలు, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు.

Hebah Patel Chetan Krishna Dhoom Dhaam Movie Trailer Released
Dhoom Dhaam : చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ధూం ధాం’. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాణంలో సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. స్టార్ రైటర్ గోపీ మోహన్ ఈ సినిమాకు స్టోరీ స్క్రీన్ ప్లే అందించారు. ధూం ధాం సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ధూం ధాం సినిమా నుంచి పాటలు, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు తండ్రి కొడుకుల ఎమోషన్ ఉందని, అలాగే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా ఈ ధూం ధాం సినిమా ట్రైలర్ ని చూసేయండి..