హీరో గోపీచంద్‌కు యాక్సిడెంట్

  • Published By: veegamteam ,Published On : February 18, 2019 / 07:14 AM IST
హీరో గోపీచంద్‌కు యాక్సిడెంట్

సినీ హీరో గోపీచంద్ కు యాక్సిడెంట్ అయ్యింది. కొత్త మూవీ షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం రాజస్థాన్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బైక్ పైనుంచి వెళ్లే స్టంట్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలోనే గోపీచంద్ బైక్ పైనుంచి కింద పడ్డాడు. గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి.. ఆస్పత్రికి తరలించారు. పెద్ద ప్రమాదం ఏమీ లేదని చిత్రయూనిట్ చెబుతోంది. గాయాలు చిన్నగాయాలే అంటోంది. 2019, ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం ఈ ఘటన జరిగింది.

తిరు దర్శకత్వంలో గోపీచంద్ కొత్త సినిమా చేస్తున్నాడు. రాజస్థాన్ లోని భారత్ – పాక్ సరిహద్దుల్లో ఈ షూటింగ్ జరుగుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే గోపీచంద్ ఈ మూవీకి సంబంధించి ఫొటో అప్ డేట్స్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. బోర్డర్ లో సైనికులతో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది.