Shyam Singha Roy: ఎన్ని సినిమాలొచ్చినా శ్యామ్ హిట్టే.. నానిలో కనిపిస్తున్న ధీమా!
క్రిస్టమస్ మనదే అంటున్నాడు శ్యామ్ సింగరాయ్. పెద్ద సినిమాల మధ్యలో వచ్చినా.. బ్లాక్ బస్టర్ ఖాయమనే ధీమా నానిలో కనిపిస్తోంది. కానీ న్యాచురల్ స్టార్ సీరియస్ రోల్స్ చేస్తానంటే..

Shyam Singha Roy
Shyam Singha Roy: క్రిస్టమస్ మనదే అంటున్నాడు శ్యామ్ సింగరాయ్. పెద్ద సినిమాల మధ్యలో వచ్చినా.. బ్లాక్ బస్టర్ ఖాయమనే ధీమా నానిలో కనిపిస్తోంది. కానీ న్యాచురల్ స్టార్ సీరియస్ రోల్స్ చేస్తానంటే.. ఆడియెన్స్ వెంటనే యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే కొత్త కలరింగ్ ఇచ్చి.. అచ్చొచ్చిన సాయి పల్లవిని వెంటేసుకొని రాబోతున్నాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నాడు. సినిమా సినిమాకు కొత్తదనం చూపించేందుకు గట్టిగా పిడికిలి బిగిస్తున్నాడు. అయితే వి, టక్ జగదీష్ ల్లో ఏం పొగొట్టుకున్నాడో కరెక్ట్ గా గుర్తించాడు. ఆ పాయింట్ ను సరి చేసుకొని శ్యామ్ సింగ రాయ్ గా రాబోతున్నాడు.
Balakrishna: సై అంటే సై అంటున్న నందమూరి నటసింహం!
అవును ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. నాని నుంచి ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేసేది గ్రౌండ్ లెవెల్ ఫన్. అదే ఇప్పుడు మళ్లీ శ్యామ్ సింగ రాయ్ లో చూపించబోతున్నాడు న్యాచురల్ స్టార్. అటు ఇటు పెద్ద సినిమాలున్నా.. క్రిస్మస్ కింగ్ శ్యామ్ సింగ రాయ్ అనే ధీమా నానిలో కనిపిస్తోంది. దానికి కారణం శ్యామ్ సింగ రాయ్ లో తను ట్రై చేసిన రెండు వేరియేషన్స్. అందులో ఒకటి వాసు క్యారెక్టర్. ఈ రోల్ తో తన రెగ్యులర్ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేయాలనుకుంటోన్న నాని.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో తనలోని హై రేంజ్ సాలిడ్ యాక్టర్ ని ప్రెజంట్ చేయబోతున్నాడు.
Vaani Kapoor: పొడుగుకాళ్ల సుందరి.. బాలీవుడ్ సోయగం వాణీ కపూర్!
ఇక కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో నానితో పాటూ హైలైట్ కానుంది సాయిపల్లవి. దేవదాసి రోల్ చేసిన పల్లవి.. ఈ విజువల్ ట్రీట్ జనాలకు కనెక్ట్ కావడం షూర్ అంటోంది. నాని, సాయి పల్లవి ఎంసిఎతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. జనాలను థియేటర్స్ కి తీసుకొచ్చే సెల్లింగ్ పాయింట్స్ లో ఇదీ ఒకటి. మరోవైపు కృతిశెట్టి లాంటి యంగ్ సెన్సేషన్ తో రొమాంటిక్ రచ్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అరవైల్లోని బెంగాలి బాబుతో సాయి పల్లవి చేసిన మ్యాజిక్.. ప్రెజెంట్ కల్చర్ లో నానితో కృతిశెట్టి హల్చల్ శ్యామ్ సింగ రాయ్ కి ప్లస్ కాబోతుంది. ఏదేమైనా ఎన్ని సినిమాలొచ్చినా.. మా సినిమా బంపర్ హిట్ అంటున్న నాని, సాయిపల్లవి, కృతిశెట్టిల మాట నిజమవుతుందో లేదో డిసెంబర్ 24న తెలిసిపోతుంది.