రామ్ కాఫీ-వరల్డ్‌లోనే కాస్ట్లీ

పూరీకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ కొనిచ్చిన రామ్.

  • Published By: sekhar ,Published On : February 5, 2019 / 10:31 AM IST
రామ్ కాఫీ-వరల్డ్‌లోనే కాస్ట్లీ

Updated On : February 5, 2019 / 10:31 AM IST

పూరీకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ కొనిచ్చిన రామ్.

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌‌ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్, ఇస్మార్ట్ శంకర్.. ఇటీవలే రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్‌లను హీరోయిన్స్‌గా ఫిక్స్ చేసారు. రీసెంట్‌గా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్ళిన రామ్, పూరీకి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడు.. గతంలో నిర్మాత బండ్ల గణేష్ ఖరీదైన లైటర్ పూరీకి గిఫ్ట్ ఇచ్చాడు.. ఇప్పుడు రామ్,అత్యంత ఖరీదైన కాఫీ నట్స్ ప్యాకెట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని పూరీ, ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కాఫీ కప్ పట్టుకుని ఉన్న పిక్ పోస్ట్ చేసి, మేరా ఇస్మార్ట్ శంకర్ రామ్, నాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ కొనిచ్చాడు.

దీనిని కోపీ లువాక్ అంటారు. దీని గురించి గూగూల్‌లో సెర్చ్ చెయ్యండి, తెలిస్తే పిచ్చెక్కిపోద్ది, ఇప్పుడు నేనీ కాఫీ తాగుతున్నాను అని పోస్ట్ చేసాడు. పూరీ ట్వీట్‌కి రిప్లై ఇస్తూ రామ్, ఈ కాఫీ గురించి గూగుల్ చెయ్యకండి, తెలిస్తే దిమాఖ్ ఖరాబ్ అవుతది అంటూ పంచ్ పేల్చాడు.. ఇంతకీ ఈ కాఫీ స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని చెర్రీస్‌తో తయారు చేస్తారట. ఎక్కువగా ఇండోనేసియాలోని సుమత్రా, జావా, సులావెసి ప్రాంతాల్లో పండిస్తారట.. దీని ధర సుమారు 35 డాలర్ల నుండి, 80 డాలర్ల వరకు ఉంటుంది.