Vaishnav Tej : కళ్యాణ్ మామయ్య చెప్తే థాయిలాండ్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా.. ఆర్మీకి వెళ్దామనుకున్నా.. కానీ అమ్మ వద్దంది..

వైష్ణవ్ మాట్లాడుతూ.. ''ఇంటర్ అయిపోయాక నిహారిక మాస్‌ కమ్యూనికేషన్‌ చేస్తుందని నేనూ చేశాను. డిగ్రీ మూడో సంవత్సరంలో అందరూ జాబ్స్ తెచ్చుకొని వెళ్లిపోతుంటే నాకేం చేయాలో తెలియలేదు. రోజు జిమ్ కి.........

Vaishnav Tej : కళ్యాణ్ మామయ్య చెప్తే థాయిలాండ్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా.. ఆర్మీకి వెళ్దామనుకున్నా.. కానీ అమ్మ వద్దంది..

Hero Vaishnav Tej wanted to join the army

Updated On : September 1, 2022 / 7:52 AM IST

Vaishnav Tej :  ఉప్పెన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత కొండపొలం సినిమాతో అంతగా మెప్పించలేకపోయాడు. ఈ సారి వైష్ణవ్ రంగరంగ వైభవంగా అంటూ లవ్ జోనర్ లో వస్తున్నాడు. వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా దర్శకుడు గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన రంగరంగ వైభవంగా సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్, డైరెక్టర్ గిరీశాయ అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఇటీవలే ఆ ఎపిసోడ్ రిలీజ్ అయింది.

వైష్ణవ్, దర్శకుడు అలీతో సరదాగా కార్యక్రమంలో ఎన్నో విషయాలని షేర్ చేసుకున్నారు. ఇందులో వైష్ణవ్ తాను చిన్నప్పట్నుంచి ఏమేమో అవ్వాలనుకొని ఇప్పుడు ఇలా నటుడ్ని అయ్యానని తెలిపాడు. వైష్ణవ్ మాట్లాడుతూ.. ”ఇంటర్ అయిపోయాక నిహారిక మాస్‌ కమ్యూనికేషన్‌ చేస్తుందని నేనూ చేశాను. డిగ్రీ మూడో సంవత్సరంలో అందరూ జాబ్స్ తెచ్చుకొని వెళ్లిపోతుంటే నాకేం చేయాలో తెలియలేదు. రోజు జిమ్ కి వెళ్ళేవాడిని, కిక్ బాక్సింగ్ చేసేవాడ్ని. కళ్యాణ్ మామయ్య చెప్తే థాయిలాండ్‌ వెళ్లి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నా. తిరిగి వచ్చిన తర్వాత కిక్‌బాక్సింగ్‌ ట్రైయినర్‌ అవుదామనుకున్నా కానీ కుదరలేదు. ఆ తర్వాత జ్యూయలరీ డిజైనర్‌, యానిమేషన్‌.. ఇలా చాలా అనుకున్నా, ఏమి సెట్ అవ్వలేదు.”

Chiranjeevi : మరోసారి డైరెక్టర్స్ కి క్లాస్ పీకిన మెగాస్టార్.. హీరోల డేట్స్ ఉన్నాయని ఫాస్ట్ గా సినిమాలు తీయొద్దు..

”చివరికి నేనేం చేయలేకపోతున్నా, నా దగ్గర ఈ ప్రాణం ఒక్కటే ఉంది దేశానికి ఇచ్చేస్తాను, ఆర్మీకి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఆర్మీ అంతా ఈజీ కాదు, చాలా కష్టపడాలి, నువ్వు చేయలేవు అని మా అమ్మ వద్దంది. ఇక డైరెక్షన్, కెమెరా సైడ్, తెర వెనుక ఏదైనా పర్లేదు అనుకున్నా కానీ కళ్యాణ్ మామయ్య నటుడవ్వమన్నారు, హీరోగా కాకుండా ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు చెయ్ అన్నారు. అప్పుడే బుచ్చిబాబు వచ్చి ఉప్పెన కథ చెప్పాడు” అని తెలిపాడు. ఇలా ఏదేదో అవుదామనుకొని చివరికి మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్.