Vijay Deverakonda : కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Hero Vijay Deverakonda Reacts On Konda Surekha Comments

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై స్టార్ హీరోల నుంచి చిన్న న‌టీన‌టుల వ‌ర‌కు స్పందిస్తున్నారు. మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతున్నారు. తాజాగా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సైతం స్పందించారు.

“ఏం జ‌రిగిందో దాని గురించి, నేటి రాజకీయాలు, రాజకీయ నాయకులు, వారి ప్రవర్తన పై నా ఆలోచ‌న‌లు, భావాల‌ను మంచి భాష‌లో వ్య‌క్తీక‌రించేందుకు క‌ష్ట‌ప‌డుతున్నాను.

Sai Durgha Tej : గ‌తంలో మా కుటుంబం పై దారుణ‌మైన వ్యాఖ్య‌లు.. అయినా గానీ.. : కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై సాయి దుర్గాతేజ్‌

కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు నేను ఒక‌టి గుర్తు చేయాల‌ని అనుకుంటున్నాను. మ‌న‌ల్ని చూసుకునేందుకు మాత్ర‌మే వారికి ఓటు వేస్తున్నాం. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల గురించి మాట్లాడటానికి, ఉద్యోగాలు, శ్రేయస్సును తీసుకురావడానికి, ఆరోగ్యం, విద్య, సౌకర్యాలను మెరుగుపరచడం మొద‌లైన వాటి కోసం.

ప్రజలుగా మేము దీన్ని అనుమతించలేము, అంగీకరించలేము. దిగ‌జారుడు రాజ‌కీయాలు ఇక చాలు.” అని విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేశారు.

Prince : ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎంతో కాలం బాధించింది.. ‘కలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రిన్స్..