Sai Durgha Tej : తెర మీద తప్ప జీవితంలో నటించలేని సినీ నటులను బలి చేయవద్దు : కొండా సురేఖ వ్యాఖ్యలపై సాయి దుర్గాతేజ్
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్‌లో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి.

Hero Sai Durgha Tej Reacts On Konda Surekha Comments
Sai Durgha Tej – Konda Surekha : అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్‌లో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇప్పటికే టాలీవుడ్ నటీనటులు ఒక్కతాటిపైకి వచ్చి ఈ విషయన్ని తీవ్రంగా ఖండించారు. గౌరవప్రదమైన స్థానంలో ఉంటూ ఇలాంటి మాటలు తగవన్నారు. ఇక తాజాగా హీరో సాయి దుర్గాతేజ్ సైతం స్పందించారు.
“రాజకీయంలో వ్యక్తిగత విమర్శలు సర్వసాధారణమైపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారు, నిన్నటి రోజున రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ఒక ప్రఖ్యాత కథానాయకి పేరును ఉపయోగించడం, ఓ ప్రఖ్యాత సినిమా కుటుంబ వ్యహారాలను ఉటంకించి, మీడియా ముఖంగా మాట్లాడడం, వారికి రాజకీయంగా ఎంత లబ్ధి చేకూరుతుందో తెలియదు.
కానీ ఓ మహిళ ఆత్మాభిమానం, ఓ కుటుంబం పరువు, ప్రతిష్టలకు తీరని నష్టం, అన్యాయం జరిగింది. గౌరవనీయులైన మంత్రివర్యులకు.. రాజకీయ విమర్శలకు, ఏ మాత్రం సంబంధం లేని, తెరమీద తప్ప జీవితంలో నటించలేని సున్నితమనస్కులైన సినీనటులను బలిచేయవద్దని, జరిగిన తొందరపాటు చర్యను, విజ్ఞులైనమీరు పెద్దమనసుతో సరిదిద్దే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ , భవిషత్తులో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని వినమ్రంగా విన్నవించుకుంటున్నా.” అని సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేశారు.
రాజకీయంలో వ్యక్తిగత విమర్శలు సర్వసాధారణమైపోయాయి , ఈ నేపథ్యంలో
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారు , నిన్నటి రోజున రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ
ఒక ప్రఖ్యాత కథానాయకి పేరును ఉపయోగించడం , ఓ ప్రఖ్యాత సినిమా కుటుంబ వ్యహారాలను ఉటంకించి ,
మీడియా…— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 3, 2024