Prince : ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎంతో కాలం బాధించింది.. ‘కలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రిన్స్..
అక్టోబర్ 4న కలి సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

Actor Prince Interesting Comments on Kali Movie Pre Release event
Prince : ప్రిన్స్, నరేష్ అగస్త్య మెయిన్ లీడ్స్ లో కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా శివ శేషు దర్శకత్వంలో కలి అనే సినిమా తెరకెక్కింది. అక్టోబర్ 4న కలి సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా మెగా హీరో వరుణ్ తేజ్, అల్లరి నరేష్, ఆది సాయి కుమార్, ఆకాష్ జగన్నాధ్, ప్రియదర్శి గెస్టులుగా వచ్చారు.
కలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత లీలా గౌతమ్ వర్మ మాట్లాడుతూ.. కలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన వరుణ్ తేజ్, అల్లరి నరేష్,ప్రియదర్శి, బలగం వేణు, ఆకాష్ గార్లకు, టీజర్ రిలీజ్ చేసిన నాగ్ అశ్విన్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రభాస్ అన్నయ్య, ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ వర్మకు అందరికి ధన్యవాదాలు. మా కలి సినిమా 4వ తేదీన థియేటర్స్ లోకి వస్తుంది అని తెలిపారు. దర్శకుడు శివ శేషు మాట్లాడుతూ.. మనం పడితే ఆ బాధ మనకు మాత్రమే తెలుస్తుంది. మనం తిరిగి నిలబడి ఎదిగితే అది పదిమందికి తెలుస్తుంది. కలి సినిమా కాన్సెప్ట్ ఇదే అని అన్నారు.
Also Read : Yogi Babu-Pawan Kalyan : డిప్యూటీ సీఎంకు థ్యాంక్స్ చెప్పిన కమెడియన్, డైరెక్టర్
ప్రియదర్శి మాట్లాడుతూ.. ప్రిన్స్ నాకు మంచి ఫ్రెండ్. ఆత్మహత్యలు వద్దని చెప్పే సినిమా ఇది. మన దేశంలో కోవిడ్ తర్వాత ఆత్మహత్యలు పెరిగాయి. వాటి గురించి చెప్పే మంచి సినిమా ఇది. ఈ సినిమాలో బల్లి పాత్రకు వాయిస్ ఇచ్చాను అని తెలిపారు. హీరో ప్రిన్స్ మాట్లాడుతూ.. కలి సినిమా అనౌన్స్ చేసినప్పుడు లవ్, రొమాంటిక్ సినిమాలు చేసుకోవచ్చు కదా ఈ కథ ఎందుకు అన్నారు. కానీ ఈ సినిమా చేయడానికి కొన్ని ఎమోషన్స్ కారణం. నా ఫేవరేట్ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎంతోకాలం బాధించింది. నా క్లోజ్ ఫ్రెండ్, నా రూమ్మేట్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు ఎంతో బాధపడ్డాను. ఆత్మహత్యల నివారణకు ఏదో ఒకటి నా వంతు ప్రయత్నం చేయాలనుకున్న సమయంలో కలి కథ నా దగ్గరకు వచ్చింది. అందుకే ఈ సినిమా చేస్తున్నాను అని తెలిపారు.
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ప్రిన్స్ నాకు ఎప్పట్నుంచో తెలుసు. తక్కువ సమయంలో మంచి నటుడిగా ఎదిగాడు. చాలా మంది కొత్తవాళ్లు ఈ సినిమాకు పనిచేసారు. కొత్త వాళ్లకు తమ సినిమా రిలీజ్ అవుతుంటే ఎన్ని అంచనాలు ఉంటాయో నాకు తెలుసు. వీళ్లంతా మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను అని అన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ రోజు నాతో పాటు నరేష్ అన్న, ప్రియదర్శి, ఆకాష్ వీళ్లంతా వచ్చారు. ప్రిన్స్ నాకు క్లోజ్ ఫ్రెండ్. ఓ పక్క హీరోగా చేస్తూనే డీజే టిల్లు, స్కంధ లాంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాడు. నా సినిమాలో కూడా ప్రిన్స్ నటించాడు. కలి సినిమా గురించి ప్రిన్స్ చాలా ఎగ్జైటింగ్ గా చెప్పాడు అని తెలిపారు.