హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్ కు కరోనా పాజిటివ్

  • Published By: murthy ,Published On : July 20, 2020 / 03:24 PM IST
హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్ కు కరోనా పాజిటివ్

Updated On : July 20, 2020 / 3:34 PM IST

కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా కలవర పెడుతోంది. రాజకీయ నాయకులతో పాటు సినీ రంగంలోని వారికి కరోనా సోకి భయ పెడుతోంది. తాజాగా యాక్షన్ హీరో సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె హీరోయిన్ ఐశ్వర్య కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆమె ఇన్ స్టా గ్రాం లో వెల్లడించారు.

డాక్టర్లు సలహాలు పాటిస్తూ హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నట్లు ఆమె చెప్పారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కూడా కరోనా టెస్టు లు చేయించుకోవాలని ఆమె సూచించారు. అందరూ తప్పని సరిగా మాస్క ధరించండి. వీలైనంత త్వరగా తాను కోలుకుంటానని ఆశిస్తున్నానని ఐశ్వర్య అర్జున్ అన్నారు.
aishwarya arjun letter