Public Events : పబ్లిక్ ఈవెంట్స్ చేయడానికి భయపడుతున్న హీరోలు, నిర్మాతలు..

ఓపెన్ ప్లేస్‌లో ఈవెంట్స్, క్రౌడ్ గ్యాదరింగ్స్ చేయొద్దని నిర్మాతలకు చెప్తున్నారట హీరోలు.

Heros and Producers wants to avoid Public Events due to Sandhya Theater Incident

Public Events : పుష్ప-2 సినిమా గ్రాండ్‌ సక్సెస్ అయింది. ఏకంగా 1600 కోట్లు కలెక్షన్స్ క్రాస్‌ చేసి వెళ్తుంది. కానీ ఎక్కడా దీని గురించి డిస్కషన్ లేదు. రీజన్‌ ఒక్కటే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన. అల్లుఅర్జున్‌పై కేసు, ఆ తర్వాత జరిగిన సంఘటనలతో మీడియా, సోషల్ మీడియా, నేషనల్ మీడియా అందరూ ఇదే అంశంపై ఫోకస్ చేశారు.

అయితే ఈ ఒక్క ఘటన టాలీవుడ్‌ను డైలమాలో పడేసింది. భారీ బడ్జెట్లు, వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌లు అంటూ హంగామాకు రెడీ అవుతోన్న ప్రొడ్యూసర్లు, స్టార్ హీరోలు అలర్ట్ అయిపోతున్నారు. ఇక అసలు పబ్లిక్ ఈవెంట్స్ పెట్టొద్దని భావిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న మూడు పెద్ద సినిమాల ప్రమోషన్స్ సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా చేసుకోవాలని అనుకుంటున్నారు.

Also Read : Bobby Deol : అవకాశాలు లేక చచ్చిపోదామనుకున్న స్టార్ హీరో.. ఛాన్స్ ఇచ్చి మళ్ళీ స్టార్ ని చేసిన సందీప్ రెడ్డి వంగ..

ఓపెన్ ప్లేస్‌లో ఈవెంట్స్, క్రౌడ్ గ్యాదరింగ్స్ చేయొద్దని నిర్మాతలకు చెప్తున్నారట హీరోలు. అంతేకాదు ఫ్యాన్స్ కూడా ఎవరూ తమను కలవడానికి ర్యాలీలుగా రావొద్దని అంటున్నారు. డిసెంబర్ 29న విజయవాడలో జరిగే గేమ్‌ ఛేంజర్‌ భారీ కటౌట్ ఈవెంట్‌కు కూడా ఫ్యాన్స్ ఎక్కువ రాకుండా చూస్తున్నారట. ఎలాంటి ఘటనలు జరగకుండా చూడటంతో పాటు ఫ్యాన్స్‌కు దూరంగా మీడియా, సోషల్ మీడియా వేదికగానే ఈవెంట్స్‌ చేస్తారని టాలీవుడ్ టాక్.

పబ్లిక్ ఈవెంట్స్ చేయకపోతే ప్రమోషన్స్ ఎలా అనేదే నిర్మాతలను, స్టార్ హీరోలను భయపెడుతున్న అంశం. మీడియా, సోషల్ మీడియాలో ప్రమోషన్స్‌ చేస్తే అంత అటెన్షన్ వస్తుందా, మూవీ పబ్లిక్‌లోకి వెళ్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారట. సోషల్ మీడియా, మీడియా, ఇతర ఫ్లాట్ ఫామ్స్‌లో ప్రచారం చేయాలంటే ఖర్చు ఎంత అవుతుంది అని కూడికలు, తీసివేతలు వేసుకుంటున్నట్లు టాక్.

Also Read : Jani Master : తెరపైకి మరోసారి జానీ మాస్టర్ కేసు.. మళ్ళీ అరెస్ట్ చేస్తారా?

సంధ్య థియేటర్ ఘటన జరగకపోయి ఉంటే ఈ బాధే ఉండకపోయేదని మధన పడుతున్నారట సినీ నిర్మాతలు. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడేదేలా అని తలలు పట్టుకుంటున్నారట ప్రొడ్యూసర్లు, హీరోలు. పబ్లిక్ ఈవెంట్స్ పెడితే తక్కువ క్రౌడ్ తో అది కూడా హైదరాబాద్ సిటీలో కాకుండా వేరే ఊళ్ళల్లోనే ఉంటాయని సమాచారం. ఫ్యాన్స్ క్షేమం కోసం, తమ జాగ్రత్త కోసం హీరోలు ఇకపై పబ్లిక్ ఈవెంట్స్ కి దూరంగా ఉంటారు అనే వినిపిస్తుంది.