Hi Nanna : ‘హాయ్ నాన్న’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

'హాయ్ నాన్న' సినిమా OTT రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారా? రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ఓటీటీలో రిలీజ్ అవుతోందంటే?

Hi Nanna

Hi Nanna : ‘హాయ్ నాన్న’ OTT రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లంతా పండగ చేసుకోవచ్చు. నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జోడీగా నటించిన ‘హాయ్ నాన్న’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.  డిసెంబర్ 7 న రిలీజైన ఈ సినిమా జనవరి 4 న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Mahesh Babu : మహేష్ బాబు పర్సనల్ టీంని చూశారా.. బాబు దుబాయ్‌లో అలా ‘కుర్చీ’లో కూర్చొని..

తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ‘హాయ్ నాన్న’కి మంచి పేరొచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగానే ఆకట్టుకుంది. నాని, మృణాల్ ఠాకూర్, బేబి కియారాల మధ్య ఎమోషన్స్‌తో నడిచిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దసరా సినిమా తర్వాత నానికి, సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్‌కి బాగానే పేరు తెచ్చింది. నాని కూతురుగా బేబి కియారా అద్భుతంగా నటించింది. ఈ సినిమా జనవరి 4 న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.

Chaitu Jonnalagadda : రోషన్‌కి ఫాదర్ పాత్రలో అదరగొట్టిన డీజే టిల్లు అన్నయ్య.. ఇతని గురించి మీకు తెలుసా?

నిజానికి హాయ్ నాన్న సినిమా జనవరి నెలాఖరున ఓటీటీకి వస్తుందని అంతా అనుకున్నారు. ఈలోపు జనవరి 4 న రిలీజ్ చేస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇక ఈ సినిమా OTT కి ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసిన వారంతా పండగ చేసుకోవచ్చు. హాయ్ నాన్న సినిమా మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. శైర్యువ్ డైరెక్ట్ చేసారు.