Mahesh Babu : మహేష్ బాబు పర్సనల్ టీంని చూశారా.. బాబు దుబాయ్‌లో అలా ‘కుర్చీ’లో కూర్చొని..
మహేష్ బాబు మౌంటెన్ డ్యూ కొత్త యాడ్ కోసం దుబాయ్ వెళ్లినట్టు సమాచారం. తాజాగా మహేష్ బాబు తన పర్సనల్ టీంతో దుబాయ్ లో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Mahesh Babu Shares his Team Photo from Ad Shoot Set in Dubai
Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడు. త్వరలో సంక్రాంతికి త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లింప్స్, సాంగ్స్ తో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నిన్న గుంటూరు కారం సినిమా నుంచి ‘కుర్చీ మడత పెట్టి..’ అని నెక్స్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ డైలాగ్ తో మాస్ బీట్స్ కొట్టి పాటని తయారు చేసినట్టు తెలుస్తుంది.
రిలీజ్ చేసిన ప్రోమోలోనే మహేష్, శ్రీలీల కలిసి అదిరిపోయే మాస్ స్టెప్పులు వేయడంతో ఇది వైరల్ గా మారింది. ఇక ఈ ఫుల్ సాంగ్ ని నేడు విడుదల చేయనున్నారు. ఇటీవలే గుంటూరు కారం షూటింగ్ పూర్తయింది. దీంతో మహేష్ ఓ యాడ్ కోసం నిన్న దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు మౌంటెన్ డ్యూ కొత్త యాడ్ కోసం దుబాయ్ వెళ్లినట్టు సమాచారం.
Also Read : Bubble Gum : కొడుకు ఫస్ట్ సినిమాలో అతిధి పాత్రల్లో నటించడానికి సుమ ఎవర్ని తీసుకొచ్చిందో తెలుసా ?
తాజాగా మహేష్ బాబు తన పర్సనల్ టీంతో దుబాయ్ లో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో మహేష్ వైఫ్ నమ్రత, హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ ఖాన్, మహేష్ పర్సనల్ మేకప్ మెన్ పట్టాభి రామారావు, మహేష్ అసిస్టెంట్.. పలువురు ఉన్నారు. ఈ ఫోటో షేర్ చేసి మై టీం అని పెట్టాడు మహేష్. ఈ ఫొటోలో మహేష్ బాబు కుర్చీలో కూర్చొని ఉండటంతో అభిమానులు సరదా కామెంట్స్ పెడుతున్నారు. నిన్నే ఇక్కడ కుర్చీ మడతపెట్టి ఇప్పుడు దుబాయ్ లో కుర్చీలో కుర్చున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు..