Bubble Gum : కొడుకు ఫస్ట్ సినిమాలో అతిధి పాత్రల్లో నటించడానికి సుమ ఎవర్ని తీసుకొచ్చిందో తెలుసా ?

సుమ కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన 'బబుల్ గమ్' రిలీజైంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు ఎవరైనా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి ఉంటారని చాలామంది ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే బబుల్ గమ్‌లో గెస్ట్ పాత్రల్లో ఎవరు కనిపించారంటే?

Bubble Gum : కొడుకు ఫస్ట్ సినిమాలో అతిధి పాత్రల్లో నటించడానికి సుమ ఎవర్ని తీసుకొచ్చిందో తెలుసా ?

Bubble Gum

Updated On : December 30, 2023 / 10:11 AM IST

Bubble Gum : స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘బబుల్ గమ్’ థియేటర్లలోకి వచ్చింది. కొడుకు సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సుమ ఫ్యామిలీ ఈగర్‌గా వెయిట్ చేసింది. ఇటు ప్రేక్షకులు కూడా సుమ కొడుకు సినిమాలో ఏం ప్రత్యేకతలు ఉన్నాయి? ఎవరెవరు నటించారు అని అనుకున్నారు. తన కొడుకు సినిమా కోసం సుమ అతిథి పాత్రల్లో నటించడానికి ఎవరిని తీసుకువచ్చింది తెలుసా?

Devil 2 : ‘డెవిల్’ సినిమా రిలీజ్ రోజే సీక్వెల్ అనౌన్స్.. డెవిల్ 2 గురించి కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?

తెలుగు యాంకర్స్‌లో సుమని మించిన వారు లేరని చెప్పాలి. బుల్లితెర, సినిమాలు, సినిమా రిలీజ్ ఫంక్షన్లతో సుమ చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల సుమ కొడుకు రోషన్ హీరోగా నటించిన ‘బబుల్ గమ్’ థియేటర్లలోకి వచ్చింది. సుమ కొడుకు సినిమా అనేసరికి ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. రోషన్ లాంచింగ్ మూవీ కాబట్టి ఇండస్ట్రీలో సుమRoshan Kanakalaకి ఉన్న పరిచయాలతో ప్రముఖ నటులు ఎవరైనా గెస్ట్ అప్పియరెన్స్‌లో కనిపిస్తారని అందరూ భావించారు. కనీసం సుమ, రాజీవ్ కనకాల కనిపిస్తారని కూడా అనుకున్నారు. కానీ అలాంటివేం జరగలేదు.

Mahesh Babu -Teja Sajja : అప్పుడు మహేష్ బాబుకి కొడుకుగా చేసి.. ఇప్పుడు మహేష్‌తో పోటీగా వస్తున్న తేజ సజ్జా..

బబుల్ గమ్ సినిమాలో గెస్ట్ రోల్‌లో ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం నటించారు. చాలా రోజులుగా తెరకు దూరంగా ఉంటున్న ఆయనని చూస్తే ప్రేక్షకులు గోల చేయకుండా ఉంటారా? ఇక ఆయన పాత్రతో పాటు సుమ తల్లి.. అంటే రోషన్ అమ్మమ్మ ఒకే ఒక్క షాట్ లో కనిపిస్తారు. ఇక సినిమా విషయానికి వస్తే యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని టాక్ వినిపిస్తోంది. సుమ కొడుకుకి నటనలో పాస్ మార్క్ లు వేయచ్చని మంచి ఫ్యూచర్ ఉందని అంటున్నారు. అంటే సుమ కష్టం తీరినట్లే అన్నమాట.