Chaitu Jonnalagadda : రోషన్‌కి ఫాదర్ పాత్రలో అదరగొట్టిన డీజే టిల్లు అన్నయ్య.. ఇతని గురించి మీకు తెలుసా?
బబుల్ గమ్ సినిమాలో రోషన్ తండ్రి పాత్రలో నటించిన చైతు జొన్నలగడ్డకి మంచి పేరొచ్చింది. చైతుకి డిజే టిల్లు సిద్దు జొన్నలగడ్డకి రిలేషన్ ఉందని మీకు తెలుసా?

Chaitu Jonnalagadda
Chaitu Jonnalagadda : రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘బబుల్ గమ్’ సినిమా డిసెంబర్ 29 న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో రోషన్‌కి ఫాదర్‌గా నటించిన చైతు జొన్నలగడ్డ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. స్క్రీన్ మీద చైతుని చూడగానే డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ పోలికలు కనిపిస్తాయి. అసలు వీరిద్దరి రిలేషన్ ఏంటి?
Bubble Gum : కొడుకు ఫస్ట్ సినిమాలో అతిధి పాత్రల్లో నటించడానికి సుమ ఎవర్ని తీసుకొచ్చిందో తెలుసా ?
బబుల్ గమ్ సినిమాలో రోషన్ తండ్రి యాదగిరి పాత్రలో నటించిన చైతు జొన్నలగడ్డకి మంచి మార్కులు పడ్డాయి. అతను ఎవరో తెలుసా? మన డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డకి స్వయానా అన్న. ఈ విషయం స్క్రీన్ మీద చైతుని చూడగానే కనిపెట్టేస్తారు. పక్కా హైదరాబాదీ స్లాంగ్‌లో చైతు అదరగొట్టేసారు. ముఖ్యంగా రోషన్‌తో చైతు కనిపించిన ప్రతి సీన్‌లో డైలాగ్స్ భలే అనిపించాయి. చైతుని స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు సిద్దూని చూస్తున్నట్లే అనిపిస్తుంది.
Devil 2 : ‘డెవిల్’ సినిమా రిలీజ్ రోజే సీక్వెల్ అనౌన్స్.. డెవిల్ 2 గురించి కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?
చైతు జొన్నలగడ్డకి ఇది మొదటి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్నట్లుగా నటించారు. ఈ సినిమా తర్వాత ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. తండ్రీకొడుకుల మధ్య సీన్స్, డైలాగ్స్ తెలంగాణ నేటివిటీకి దగ్గరగా చాలా సహజంగా అనిపిస్తాయి. రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాని రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేయగా మానస చౌదరి రోషన్‌కి జోడిగా నటించారు. బబుల్ గమ్ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన వస్తోంది. యూత్‌కి మాత్రం బాగానే కనెక్ట్ అయ్యింది.