మిస్సింగ్ కేస్ నాకివ్వండి సార్ – ఇంట్రెస్టింగ్‌గా ‘హిట్’ టీజర్

యుంగ్ హీరో విశ్వక్ సేన్, రుహాని శర్మ జంటగా.. నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న థ్రిల్లర్ ‘హిట్’ టీజర్ ఆకట్టుకునేలాఉంది..

  • Published By: sekhar ,Published On : January 31, 2020 / 07:47 AM IST
మిస్సింగ్ కేస్ నాకివ్వండి సార్ – ఇంట్రెస్టింగ్‌గా ‘హిట్’ టీజర్

Updated On : January 31, 2020 / 7:47 AM IST

యుంగ్ హీరో విశ్వక్ సేన్, రుహాని శర్మ జంటగా.. నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న థ్రిల్లర్ ‘హిట్’ టీజర్ ఆకట్టుకునేలాఉంది..

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ఫస్ట్ సినిమా ‘అ!’ తోనే మంచి అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో ప్రయత్నంగా వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ‘ఫలక్‌నుమాదాస్‌’ చిత్రంతో  యూత్‌లో క్రేజ్‌ సంపాదిచుకున్న విశ్వక్‌సేన్‌ హీరోగా ‘హిట్‌’ అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ రూపొందిస్తున్నాడు. (ది ఫస్ట్ కేస్) అనేది ట్యాగ్ లైన్..

రుహాని శర్మ(చి.ల.సౌ ఫేమ్‌) హీరోయిన్‌గా నటిస్తోంది. నాని సమర్పణలో, శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘దిస్‌ జాబ్‌ విల్‌ డిస్ట్రాయ్‌ యు విక్రమ్‌’ అనే లేడి డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది.

Read Also : మోహన్ లాల్ థ్రిల్లర్ ‘రామ్’లో త్రిష

కానీ విక్రమ్ అనుకున్నది సాధించేదాకా వరకూ వదిలిపెట్టే రకం కాదు.. కాబట్టే, ఏదేమైనా సరే.. కానీ ‘డిపార్ట్‌మెంట్‌ను మాత్రం నేను వదల్లేను’ అని తెగేసి చెప్తున్నాడు. తక్కువ డైలాగులతో, అదరగొట్టే బీజీఎమ్‌తో, చక్కటి విజువల్స్‌తో రూపొందించిన టీజర్‌ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా ప్రధానంగా ఓ మిస్సింగ్‌ కేసు చుట్టూనే సాగనున్నట్లు తెలుస్తోంది. భాను చందర్, బ్రహ్మాజీ, మురళీశర్మ, హరితేజ తదితరులు నటిస్తున్న ‘హిట్’ ఫిబ్రవరి 28న విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ :ఎస్. మణికందన్, ఎడిటింగ్ : గ్యారీ, మ్యూజిక్ : వివేక్‌ సాగర్‌, ఫైట్స్ : నభ, ఆర్ట్ : అవినాష్ కొల్లా.