The Expendables 4 : సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ఎక్స్‌పెండబుల్స్-4 విడుదల తేదీ..

టాలీవుడ్ ఆడియన్స్ హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను విపరీతంగా ఆదరిస్తుంటారు. తాజాగా అటువంటి ఒక సినిమా..

The Expendables 4 : సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ఎక్స్‌పెండబుల్స్-4 విడుదల తేదీ..

Hollywood movie The Expendables 4 release date

Updated On : September 12, 2023 / 6:55 PM IST

The Expendables 4 : టాలీవుడ్ ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాని ఆదరిస్తుంటారు. ఇక హాలీవుడ్ చిత్రాలను కంటిన్యూగా ఫాలో అవుతూ వస్తుంటారు. తెలుగు సినిమా రిలీజ్ లకు వెళ్లినట్లు ఆ చిత్రాలకు కూడా ఫస్ట్ షోకి వెళ్లిపోతుంటారు. తాజాగా యాక్షన్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ ప్రధాన పాత్ర పోషించిన ఎక్స్‌పెండబుల్స్-4 విడుదలకు సిద్ధమైంది. ఎక్స్‌పెండబుల్ సిరీస్ డేవిడ్ కల్లాహం సృష్టించిన పాత్రల ఆధారంగా రూపొందించబడింది.

The Vaccine War : ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్ రిలీజ్.. కరోనా పై భారత్ పోరాటం..

స్కాట్ వా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి స్పెన్సర్ కోహెన్, విమ్మర్, డాగర్‌హార్ట్ కథని. కర్ట్ విమ్మర్, టాడ్ డాగర్‌హార్ట్, మాక్స్ ఆడమ్స్ స్క్రీన్ ప్లేని అందించారు. ఇది ది ఎక్స్‌పెండబుల్స్ 3కి సీక్వెల్. ఈ సినిమా ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 22, 2023న విడుదల కానుందని PVR పిక్చర్స్ తెలియజేసింది.

Mark Antony : మళ్ళీ పుట్టిన ‘సిల్క్ స్మిత’.. మార్క్ ఆంటోని చిత్రంతో ఎంట్రీ..

USA, రష్యా మధ్య యుద్ధాన్ని నివారించడానికి, డేర్-డెవిల్ ది ఎక్స్‌పెండబుల్స్ జట్టు- నిరోధించే అద్భుతమైన మిషన్‌తో ఈ చిత్రం సాగుతుంది. సుర్టో రహ్మత్ (ఇకో ఉవైస్) నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ లిబియాలోని రసాయనాల కర్మాగారం నుండి అణు క్షిపణి డిటోనేటర్లు ధనికులకు అమ్ముతారు. రెండు సూపర్ పవర్స్! ఎక్స్‌పెండబుల్స్ బృందం చర్యలోకి దిగి ముందుకు సాగుతుంది. ఇది చాలా హైప్ క్రియేట్ చేస్తాయని దర్శకుడు తెలిపారు.