అమితాబ్ ఆరోగ్యంపై గందరగోళం: కోలుకోవాలంటూ నెటిజన్ల ఆకాంక్ష

అమితాబ్ ఆరోగ్యంపై గందరగోళం: కోలుకోవాలంటూ నెటిజన్ల ఆకాంక్ష

Updated On : October 18, 2019 / 11:39 AM IST

బాలీవుడ్ ఆల్ టైమ్ ఫేవరేట్ యాక్టర్, సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం దెబ్బతిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అనారోగ్యానికి గురి అయ్యాడని నెటిజన్లు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ముంబై హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని, అక్కడే కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకుంటారని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. 

దీనిపై క్లారిటి ఇచ్చే విధంగా కర్వా చౌత్ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసినప్పటికీ అమితాబ్ పై సానుభూతికి ఫుల్ స్టాప్ లేకుండా పోయింది. అమితాబ్ బచ్చన్- జయా బచ్చన్‌లు కలిసి ఉన్న ఫొటోను బిగ్ బీ ట్వీట్ చేశారు. 

దానికి నెటిజన్లు దేవుడి మిమ్మల్ని చల్లగా చూసి త్వరగా కోలుకోవాలని.. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి అని.. మీ ఆరోగ్యం గురించి ఓ చెడు వార్త విన్నాను. అది అబద్దం అవ్వాలని కోరుకుంటున్నాను. నీ ఆరోగ్యం గురించి, సుదీర్ఘ జీవితం ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నా… జాగ్రత్తగా ఉండండి అంటూ సానుభూతి ట్వీట్లు వస్తున్నాయి.