నాన్న క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు
గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శక, నిర్మాత రాకేష్ రోషన్

గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శక, నిర్మాత రాకేష్ రోషన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శక, నిర్మాత రాకేష్ రోషన్ గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు, స్టార్ హీరో హృతిక్ రోషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈరోజు ఉదయం మీతో ఫోటో దిగాలనుందని నాన్నని అడిగాను. సర్జరీ రోజు కూడా ఆయన జిమ్‌కి రావడం మానరని నాకు తెలుసు, నాకు తెలిసి ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్, కొద్ది రోజులుగా గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతూనే హ్యాపీగా జీవిస్తున్నారాయన. ఫ్యామిలీలో ఆయన లాంటి లీడర్ ఉన్నందుకు మేమంతా అదృష్టవంతులం, లవ్యూ డాడ్ అంటూ, తండ్రితో కలిసి దిగిన షోటోని షేర్ చేసాడు హృతిక్.
ఈ పోస్ట్ చేసిన కాసేపటికే 7లక్షలకు పైగా లైక్స్, రాకేష్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ వచ్చాయి. కొద్ది కాలంగా రాకేష్, క్రిష్ సిరీస్‌లో రూపొందబోయే క్రిష్4 సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి వల్ల, క్రిష్4 ప్రీ ప్రొడక్షన్ పనులు వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. గత కొంత కాలంగా బాలీవుడ్ పరిశ్రమలో క్యాన్సర్ మహమ్మారి పలువురు సెలబ్రెటీలను బాధిస్తుంది. మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, ఇర్ఫాన్ ఖాన్ వంటి వారు, క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు. ప్రస్తుతం విదేశాల్లో చికిత్స తీసుకుంటున్న సీనియర్ నటుడు రిషి కపూర్ కూడా క్యాన్సర్‌తో బాధ పడుతున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు రాకేష్ రోషన్ విషయం తెలియగానే, బాలీవుడ్ మరోసారి ఉలిక్కి పడింది.