భాగ్యనగరం టు బాలీవుడ్.. అమ్రిన్ ఖురేషి ఎవరంటే!

Amrin Qureshi: తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘సినిమా చూపిస్త మావ’, ‘జులాయి’ సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లోనూ అమ్రిన్ ఖురేషి హీరోయిన్‌గా నటిస్తోంది.ఈమె ఎవరో కాదు..‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాజిద్ ఖురేషి కుమార్తె, రాయల్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత ఎమ్.ఐ.ఖురేషి మనవరాలు. హిందీ చిత్రాలు నిర్మాణంలో ఉండగానే తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆఫర్స్ వస్తుండటంతో అమ్రిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది.
https://10tv.in/rashmika-mandanna-is-national-crush-of-india-this-year/
‘సినిమా చూపిస్త మావ’ రీమేక్ రూపొందుతున్న ‘బ్యాడ్‌బాయ్’ మూవీకి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్‌బాక్స్ పిక్చర్స్ పతాకంపై సాజిద్ ఖురేషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2021 సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన సూపర్‌హిట్ మూవీ ‘జులాయి’ రీమేక్‌గా రూపొందుతున్న సినిమాకి సూపర్ డైరెక్టర్ టోని డిసౌజ దర్శకత్వంలో రూపొందనుంది.
ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాల్లోనూ బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా నటిస్తుండడం విశేషం.